'తెలుగువారికి ఒకే రాష్ట్రం మహాత్ముడు ఇచ్చిన మాట' | Mahatma Promise one state to telugu people Gattu Ramachandra Rao | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 26 2013 3:28 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

స్వతంత్ర ఉద్యమం కాలంలోనే తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని మహాత్మాగాంధీ మాట ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు తెలిపారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి 102 సంవత్సరాల పోరాటం చరిత్ర ఉందన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సమైక్య రాష్ట్రాన్నే కోరుకున్నారని తెలిపారు. వారి కంటే సోనియా గాంధీ గొప్పేవారమీ కాదన్నారు. సమైక్య శంఖారావం 23 జిల్లాలదని చెప్పారు. సమైక్యమనేది 2 ప్రాంతాల మధ్య ఘర్షణ కాదని, రెండు వాదనల మధ్య ఘర్షణ అని వివరించారు. విభజన వల్ల తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ మళ్లీ తలెత్తుతుందని హెచ్చరించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 40 వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన తెలంగాణ ప్రాజెక్ట్‌లన్నీ నష్టపోతాయని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement