హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జరప తలపెట్టిన సమైక్య శంఖారావం సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును, సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు పేరును ఖరారు చేశారు. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్య శంఖారావానికి భారీ భద్రతా ఏర్పాట్లును చేశారు. ఏ గేటు నుంచి మహిళలు, ఎఫ్ గేటు నుంచి వీఐపీలు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఎఫ్-1, జీ గేటు నుంచి ప్రజలకు ప్రవేశం కల్పిస్తున్నారు. డి గేటు నుంచి వీవీఐపీలకు ప్రవేశం కల్పించారు.
ప్రజల ఆలోచనా విధానాన్ని ఢిల్లీకి వినిపించడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో తమ పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపడతాయని, ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని తెలిపారు.