
'సీమాంధ్రులను పోలీసులు అవమానించారు'
సంఘ విద్రోహ శక్తులంటూ సీమాంధ్రులను పోలీసులు అవమానించారని వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: సంఘ విద్రోహ శక్తులంటూ సీమాంధ్రులను పోలీసులు అవమానించారని వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ సమైక్య శంఖారావం సభకు అనుమతిని నిరాకరిచడం సీమాంధ్ర ప్రజలను అవమానించడామేనన్నారు. సభకు అనుమతి నిరాకరణపై మీడియాతో ఆమె మాట్లాడారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఓ గేమ్ ను ఆడుతుందని.. ఆ గేమ్ లో భాగంగానే సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఏపీ భవన్ లో దీక్ష దిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. చంద్రబాబుకు ఏపీ భవన్ లో అనుమతి ఇచ్చి.. సమైక్య సభకు హైదరాబాద్ లో అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.