భజే వాయు వేగం  | Bhaje Vayu Vegam Movie Motion Poster Launched | Sakshi
Sakshi News home page

భజే వాయు వేగం 

Published Sat, Apr 13 2024 3:39 AM | Last Updated on Sat, Apr 13 2024 3:39 AM

Bhaje Vayu Vegam Movie Motion Poster Launched - Sakshi

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘భజే వాయు వేగం’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై ‘భజే వాయు వేగం’ రూపొందుతోంది.

ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, మోషన్‌ పోస్టర్‌ను హీరో మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేసి, అభినందనలు తెలిపారు. ‘‘ఫ్రెష్‌ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement