తప్పకుండా నచ్చుతుంది | Margam Poster Launched | Sakshi
Sakshi News home page

తప్పకుండా నచ్చుతుంది

Published Wed, Mar 25 2015 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

తప్పకుండా నచ్చుతుంది

తప్పకుండా నచ్చుతుంది

 స్వదేశానికి వచ్చిన యువకుడు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడన్న కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘జయం కొండాన్’. వినయ్, భావన జంటగా నటించిన ఈ చిత్రాన్ని సత్యదేవా పిక్చర్స్ పతాకంపై ఆర్. సత్యనారాయణ ‘మార్గం’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘వాణిజ్య హంగులు ఉన్న సినిమా ఇది. దర్శకుడు ఆర్. కన్నన్ అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, కెమెరా: బాల సుబ్రమణ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement