దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ సేన కార్యకర్తలు బాబర్ రోడ్డు పేరును అయోధ్య రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు బాబర్ రోడ్డు అని ఉన్న సూచిక బోర్డుపై అయోధ్యమార్గ్ అనే పేరు అతికించారు.
ఈ సందర్భంగా హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ ‘బాబర్ రోడ్డు పేరును మార్చాలని హిందూ సేన చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ దేశం భారతదేశం.. ఇది శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, వాల్మీకి, గురు రవిదాస్ తదితర మహానుభావులు నడయాడిన దేశం. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మిస్తున్నారు. బాబర్ నిర్మించిన బాబ్రీ మసీదు ఇక లేనప్పుడు, ఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు వల్ల ఉపయోగం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
న్యూఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌లో ఉన్న బాబర్ రోడ్డు పేరు మార్చాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఎన్‌డీఎంసీ ఛైర్మన్‌కు ఒక లేఖరాశారు. బాబర్ ఒక చొరబాటుదారుడని, హిందువులపై దౌర్జన్యాలను సాగించాడని, అందుకే బాబర్ పేరుతో ఉన్న ఈ రహదారి పేరును అయోధ్య మార్గ్‌గా మార్చాలని ఆ లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment