babar
-
బాబార్ రోడ్డును అయోధ్య మార్గ్‌గా మార్చాలంటూ..
దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ సేన కార్యకర్తలు బాబర్ రోడ్డు పేరును అయోధ్య రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు బాబర్ రోడ్డు అని ఉన్న సూచిక బోర్డుపై అయోధ్యమార్గ్ అనే పేరు అతికించారు. ఈ సందర్భంగా హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ ‘బాబర్ రోడ్డు పేరును మార్చాలని హిందూ సేన చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ దేశం భారతదేశం.. ఇది శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, వాల్మీకి, గురు రవిదాస్ తదితర మహానుభావులు నడయాడిన దేశం. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మిస్తున్నారు. బాబర్ నిర్మించిన బాబ్రీ మసీదు ఇక లేనప్పుడు, ఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు వల్ల ఉపయోగం ఏమిటి?’ అని ప్రశ్నించారు. న్యూఢిల్లీలోని బెంగాలీ మార్కెట్లో ఉన్న బాబర్ రోడ్డు పేరు మార్చాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఎన్డీఎంసీ ఛైర్మన్‌కు ఒక లేఖరాశారు. బాబర్ ఒక చొరబాటుదారుడని, హిందువులపై దౌర్జన్యాలను సాగించాడని, అందుకే బాబర్ పేరుతో ఉన్న ఈ రహదారి పేరును అయోధ్య మార్గ్‌గా మార్చాలని ఆ లేఖలో కోరారు. -
బీజేపీ వీరాభిమాని హత్య.. యోగి సర్కార్ సీరియస్
బీజేపీ వీరాభిమాని ఒకరు దారుణ హత్యకు గురికావడం పట్ల సర్కార్ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. బీజేపీకి మద్ధతు ఇవ్వడం.. ఆపై ఎన్నికల విజయోత్సవ సంబురాల్లో పాల్గొనడంతో చుట్టుపక్కల వాళ్లే కోపంతో అతనిపై దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 20న ఆదివారం కుషి నగర్ కథార్ఘరి గ్రామంలో బాబర్ అలి(25) అనే యువకుడిపై స్థానికులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాబర్‌ను లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. వారం తర్వాత బాబర్ కన్నుమూశాడు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులు స్వస్థలానికి తీసుకురాగా.. నిందితులను అరెస్ట్ చేస్తేనేగానీ అంత్యక్రియలకు ముందుకెళ్లమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో న్యాయం చేస్తామని పోలీసుల హామీతో.. చివరకు బాబర్ అలి అంత్యక్రియలు జరిగాయి. బీజేపీ హార్డ్‌కోర్ ఫ్యాన్ బాబర్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ప్రకారం.. ఆ యువకుడు బీజేపీకి వీరాభిమాని. మొన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశాడు. అంతేకాదు మార్చి 10వ తేదీన ఫలితాల అనంతరం.. బీజేపీ విజయంపై సంతోషంతో సంబురాల్లో పాల్గొన్నాడు కూడా. అయితే ఈ విషయమై తరచూ.. స్థానికులు అతనికి హెచ్చరికలు కూడా జారీ చేసేవారట. బీజేపీకి మద్దతు ఇచ్చినా, ప్రచారాల్లో పాల్గొన్నా బాగోదని బెదిరించేవారట. ఈ క్రమంలో ఫలితాలు వచ్చిన రోజు స్వీట్లు పంచిన టైంలోనే స్థానికులతో పెద్ద వాగ్వాదం జరిగిందని బాబర్ కుటుంబం చెబుతోంది. ఈ విషయమై తాము కూడా బాబర్‌ను సున్నితంగా వారించామని కానీ, అతను మాత్రం మొండిగా ముందుకెళ్లాడని బాబర్ తల్లి అంటోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కటాకటాల వెనక్కి పంపి కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబం ప్రభుత్వాన్ని కోరుతోంది. స్పందించిన సీఎంవో ఇదిలా ఉండగా.. ఈ ఘటన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు బాబర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సీఎంవో ట్వీట్ ద్వారా వెల్లడించింది. #UPCM श्री @myogiadityanath जी ने कुशीनगर के कठघरही गांव के श्री बाबर जी की लोगों द्वारा पिटाई से हुई मौत पर गहरा शोक व्यक्त किया है। मुख्यमंत्री जी ने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है। उन्होंने मामले की गहनता से निष्पक्ष जांच हेतु अधिकारियों को निर्देश दिए हैं। — CM Office, GoUP (@CMOfficeUP) March 27, 2022 -
కోహ్లితో పోల్చొద్దు: పాక్ కెప్టెన్ బాబర్
కరాచీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లితో తనను పోల్చుతుండటంతో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆక్రోశించాడు. విరాట్‌కు బదులుగా పాక్ దిగ్గజాలతో పోలిస్తే తనకు సంతోషమన్నాడు. ‘మీరు నన్ను మియాందాద్, మొహమ్మద్ యూసుఫ్, యూనిస్ఖాన్లతో పోలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. కోహ్లితో లేక ఇతర భారత క్రికెటర్లతో నన్నెందుకు పోలుస్తారు’ అని బాబర్ వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 50కి పైగా సగటుతో 16 సెంచరీలు, 26 టెస్టుల్లో 45.12 సగటుతో 1850 పరుగులు సాధించాడు. మరోవై పు కోహ్లి అన్ని ఫార్మాట్లలో 50 సగటుతో 70 సెంచ రీలు చేశాడు. -
ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం
చిలకలూరిపేట : తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖననం చేసిన 10 రోజుల అనంతరం సమాధి నుంచి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలూకాకు చెందిన బాబర్ సిద్ధునాథ్ దేవినాథ్ తన భార్య బాబర్ పంచెపుల(30)తో కలసి సాయిబాబా చిత్రపటం బండిపై ఏర్పాటు చేసుకొని వివిధ రాష్ట్రాల్లో బిక్షాటన చేస్తుంటారు. వీరికి గణేష్, రమేష్ అనే ఇరువురు సంతానం. ఈ నెల ఎనిమిదో తేదీ చెన్నై నుంచి చిలకలూరిపేట పట్టణానికి భార్యాపిల్లలతో వచ్చాడు. ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డు పక్కన సామగ్రి ఉంచాడు. భార్య పంచెపుల అనారోగ్యానికి గురయ్యిందంటూ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించాడు. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలసి ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డుపక్కన నిద్రపోయారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 గంటల సమయంలో పంచెపుల మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని పట్టణంలోని శ్మశానవాటికలో ఖననం చేసి వెళ్లిపోయాడు. అయితే మృతిరాలి తల్లి చంద్రాబాయి తన అల్లుడే కుమార్తెను కొట్టి చంపి ఉంటాడని పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయడంతో గురువారం పోస్టుమార్టం నిర్వహింపచేశారు. కుమార్తె మృతి చెందిన విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకురాలేదని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం! కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఇంటూరి రామచంద్రబాబు, తహశీల్దార్ జీవీఎస్ ఫణింద్రబాబు, అర్బన్ సీఐ జి చెంచుబాబు, ఎస్ఐ అసన్, ఆర్ఐ యలమంద, వీర్వోలు అప్పారావు, సైదా, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీటీపై ‘యుద్ధం’!
పింప్రి, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ హామీలను కురిపిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకొని పుణే వ్యాపారులు ఎల్బీటీ రద్దు అంశాన్ని మరోమారు తెరమీదికి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి పుణే నగర వ్యాపార సంఘాలు సమావేశమై రాత్రి పొద్దుపోయేవరకు ఈ అంశంపై చర్చలు జరిపారు. బిబ్వేవాడిలోని నగర వ్యాపార మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దీనికి సంఘ అధ్యక్షుడు పోపట్వాడ్ ఓస్వాల్ అధ్యక్షత వహించా రు. ఈ సమావేశంలో మూడు విషయాలపై సుదీ ర్ఘంగా చర్చించారు. ఈ నెల 24వ తేదీన వ్యాపార సంస్థలన్నీ బంద్ పాటించాలని, రాబోయే ఎన్నికల్లో వ్యాపారుల్లో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టాలని, ఎల్బీటీని రద్దు చేసేవరకు పోరాటం కొనసాగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈసారి వ్యాపారులతో వినియోగదారులను కూడా మమేకం చేయాలని నిర్ణయిం చారు. వినియోగదారులు ఏ విధంగా నష్టపోతున్నదీ ప్రతి వ్యాపారీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. వారిని తమతో కలసి ఎల్బీటీకి వ్యతిరేకంగా ఉద్యమించేలా ప్రేరేపించాలని సూచిం చారు. ఈ సమావేశంలో 85 సంఘాల ప్రతినిధులు, పుణే వ్యాపార మహాసంఘ్ ఉపాధ్యక్షుడు మురళీభాయి షాహా, సూర్యకాంత్ పాఠక్, మహేంద్ర పితలియా, హేమంత్షాహా, రాజు సురాణా, జయంత్శేట్, విజయ ఓస్వాల్, సురేంద్ర జైన్, రాజేష్ శేవానీ, రవీ ఓస్వాల్ తదితరులు ప్రసంగించారు. ఎల్బీటీపై తిరిగి పోరాటం: ఎంపీ బాబర్ ప్రభుత్వం రాష్ట్రంలోని 26 కార్పొరేషన్ల పరిధిలో ఆక్ట్రాయ్కు బదులు స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ)ను ప్రవేశపెట్టి వ్యాపారుల నడ్డి విరుస్తున్నారని ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ పింప్రి-చించ్వాడ్ అధ్యక్షుడు ఎంపీ గజానన్ బాబర్ తెలిపారు. శనివారం సాయంత్రం పింప్రి చించ్వాడ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్బీటీ రద్దుపై వ్యాపారులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. పింప్రి-చించ్వాడ్ నగరంలోని వ్యాపారులు ఎల్బీటీ పన్నును చెల్లించరాదని, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎల్బీటీ వ్యతిరేక ఆందోళనను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్బీటీని రద్దు చేసేవరకు పోరాటాన్ని సాగించాలని సూచిం చారు. కాగా రాష్ర్టంలో తప్ప దేశంలో మరెక్కడా ఎల్బీటీ లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది లా ఉండగా, ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించా రు. సంఘ అధ్యక్షుడు మోహన్ గుర్నాని నేతృత్వం లో త్వరలో ప్రతి జిల్లాలో వ్యాపారులతో కలసి కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన వివరించారు.