పింప్రి, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ హామీలను కురిపిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకొని పుణే వ్యాపారులు ఎల్బీటీ రద్దు అంశాన్ని మరోమారు తెరమీదికి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి పుణే నగర వ్యాపార సంఘాలు సమావేశమై రాత్రి పొద్దుపోయేవరకు ఈ అంశంపై చర్చలు జరిపారు.
బిబ్వేవాడిలోని నగర వ్యాపార మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దీనికి సంఘ అధ్యక్షుడు పోపట్‌వాడ్ ఓస్వాల్ అధ్యక్షత వహించా రు. ఈ సమావేశంలో మూడు విషయాలపై సుదీ ర్ఘంగా చర్చించారు.
ఈ నెల 24వ తేదీన వ్యాపార సంస్థలన్నీ బంద్ పాటించాలని, రాబోయే ఎన్నికల్లో వ్యాపారుల్లో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టాలని, ఎల్బీటీని రద్దు చేసేవరకు పోరాటం కొనసాగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈసారి వ్యాపారులతో వినియోగదారులను కూడా మమేకం చేయాలని నిర్ణయిం చారు. వినియోగదారులు ఏ విధంగా నష్టపోతున్నదీ ప్రతి వ్యాపారీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. వారిని తమతో కలసి ఎల్బీటీకి వ్యతిరేకంగా ఉద్యమించేలా ప్రేరేపించాలని సూచిం చారు. ఈ సమావేశంలో 85 సంఘాల ప్రతినిధులు, పుణే వ్యాపార మహాసంఘ్ ఉపాధ్యక్షుడు మురళీభాయి షాహా, సూర్యకాంత్ పాఠక్, మహేంద్ర పితలియా, హేమంత్‌షాహా, రాజు సురాణా, జయంత్‌శేట్, విజయ ఓస్వాల్, సురేంద్ర జైన్, రాజేష్ శేవానీ, రవీ ఓస్వాల్ తదితరులు ప్రసంగించారు.
ఎల్బీటీపై తిరిగి పోరాటం: ఎంపీ బాబర్
ప్రభుత్వం రాష్ట్రంలోని 26 కార్పొరేషన్ల పరిధిలో ఆక్ట్రాయ్‌కు బదులు స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ)ను ప్రవేశపెట్టి వ్యాపారుల నడ్డి విరుస్తున్నారని ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ పింప్రి-చించ్‌వాడ్ అధ్యక్షుడు ఎంపీ గజానన్ బాబర్ తెలిపారు. శనివారం సాయంత్రం పింప్రి చించ్‌వాడ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్బీటీ రద్దుపై వ్యాపారులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. పింప్రి-చించ్‌వాడ్ నగరంలోని వ్యాపారులు ఎల్బీటీ పన్నును చెల్లించరాదని, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎల్బీటీ వ్యతిరేక ఆందోళనను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.
ఎల్బీటీని రద్దు చేసేవరకు పోరాటాన్ని సాగించాలని సూచిం చారు. కాగా రాష్ర్టంలో తప్ప దేశంలో మరెక్కడా ఎల్బీటీ లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది లా ఉండగా, ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించా రు. సంఘ అధ్యక్షుడు మోహన్ గుర్‌నాని నేతృత్వం లో త్వరలో ప్రతి జిల్లాలో వ్యాపారులతో కలసి కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన వివరించారు.
ఎల్బీటీపై ‘యుద్ధం’!
Published Mon, Feb 17 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement