
కరాచీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లితో తనను పోల్చుతుండటంతో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆక్రోశించాడు. విరాట్‌కు బదులుగా పాక్ దిగ్గజాలతో పోలిస్తే తనకు సంతోషమన్నాడు. ‘మీరు నన్ను మియాందాద్, మొహమ్మద్ యూసుఫ్, యూనిస్‌ఖాన్‌లతో పోలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. కోహ్లితో లేక ఇతర భారత క్రికెటర్లతో నన్నెందుకు పోలుస్తారు’ అని బాబర్ వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 50కి పైగా సగటుతో 16 సెంచరీలు, 26 టెస్టుల్లో 45.12 సగటుతో 1850 పరుగులు సాధించాడు. మరోవై పు కోహ్లి అన్ని ఫార్మాట్లలో 50 సగటుతో 70 సెంచ రీలు చేశాడు.