Pakistan captain
-
పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్ల నూతన కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహిసిన్ నఖ్వి అధికారికంగా ప్రకటించాడు. కొద్ది రోజుల కిందట పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ వైదొలిగిన విషయం తెలిసిందే. రానున్న ఆస్ట్రేలియా, జింబాబ్వే టూర్లతో రిజ్వాన్ కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఇవాళ ఉదయం ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం పాకిస్తాన్ జట్లను ప్రకటించారు. జట్లను ప్రకటించే సమయంలో కెప్టెన్ పేరును వెల్లడించలేదు. తాజాగా పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వి రిజ్వాన్ పేరును ప్రకటించాడు. రిజ్వాన్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా వ్యవహరిస్తాడని నఖ్వీ తెలిపాడు.పాక్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం జట్లను ఎంపిక చేయడంతో తమ పాటు తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించింది. పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కొత్తగా ఐదుగురికి అవకాశం లభించింది. బాబర్ ఆజమ్‌కు అనుకూలంగా బోర్డుకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన ఫఖర్ జమాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా..కేటగిరీ-ఏ: బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్కేటగిరీ-బి: నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్కేటగిరీ-సి: అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్కేటగిరీ-డి: అమీర్ జమాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మొహమ్మద్ అలీ, మహ్మద్ హుర్రైరా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ ఖాన్ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం పాక్ జట్లు..ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిదిఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు పాక్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షానవాజ్ దహానీ, తయ్యబ్ తాహిర్జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు..అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా, సుఫ్యాన్ మొఖిమ్, ఉస్మాన్ ఖాన్ -
బాబర్‌కు ఇప్పుడైనా సిగ్గు వచ్చింది: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ బౌలర్ సికందర్ బఖ్త్ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా బాబర్‌కు సిగ్గు వచ్చిందని.. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైనపుడే ఈ పని చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ జట్టు పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్ చేతిలో తొలిసారి వన్డే పరాజయం చవిచూసిన బాబర్ బృందం.. సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా బాబర్ ఆజం టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా ఈ క్రమంలో టెస్టు జట్టుకు షాన్ మసూద్‌ను నాయకుడిగా ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. టీ20 పగ్గాలను ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. అయితే, వీరిద్దరు ఆరంభం నుంచే కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు షాహిన్‌పై వేటు వేసిన పీసీబీ.. బాబర్ ఆజంను తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించింది.తాజాగా మరోసారి రాజీనామాఅయితే, అమెరికా- వెస్టిండీస్‌లో జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓడటమే గాక.. కనీసం సూపర్-8 దశకు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టింది. జూన్‌లో ఈ టోర్నీ ముగిసిన నాటి నుంచి బాబర్ ఆజం.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చిందిబ్యాటింగ్పై దృష్టి పెట్టే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు బాబర్ ప్రకటించాడు. ఈ విషయంపై స్పందించిన సికందర్ బఖ్త్.. ‘‘ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చింది. నిజానికి వరల్డ్‌కప్‌లో మా జట్టు ఓడిన నాడు.. అంటే జూన్ 16నే అతడు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది.బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పిందిఅప్పుడే కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సింది. దేశం మొత్తం ఇదే కోరుకుంది. కానీ అతడు మొండిగా ప్రవర్తించాడు. తను తాను ఓ కింగ్‌లా ఊహించుకోవడం బాబర్‌కు అలవాటు. తన ఆట తీరు బాగా లేకున్నా.. బాగుందనే ఫీలవుతాడు. అయితే, బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పింది. అందుకే ఇప్పటికైనా కెప్టెన్సీని వదులుకున్నట్లు ప్రకటించాడు’’ అని పేర్కొన్నాడు.ఇంటా, బయటా వరుస ఓటములు.. అయినాకాగా టెస్టులకు షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించడంపై కూడా సికందర్ బఖ్త్ విమర్శలు చేశాడు. ఇంటా, బయటా వరుస టెస్టు సిరీస్‌లలో ఓటములనే బహుమతిగా ఇస్తున్న ఆటగాడు కెప్టెన్‌గా ఉండటం దురదృష్టకరమంటూ పెదవి విరిచాడు. కాగా పాకిస్తాన్ తరఫున 1976- 1989 వరకు సికందర్ బఖ్త్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 26 టెస్టుల్లో 67, వన్డేల్లో 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.చదవండి: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
మళ్లీ పప్పులో కాలేసిన పాక్ కెప్టెన్
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఆండర్సన్.. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్లో 704 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్.. రెడ్‌బాల్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా తన కెరీర్‌ను ముగించాడు. ఈ క్రమంలో అండర్సన్స్కు క్రికెటర్లు,అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఆండర్సన్‌కు అభినందనలు తెలిపే క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పప్పులో కాలు వేశాడు. ఆండర్సన్ ‘కట్టర్’లను ఎదుర్కోవడం విశేషం అని బాబర్ తెలిపాడు."జిమ్మీ.. మీ బౌలింగ్‌లో కట్టర్లను ఎదుర్కోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు జెంటిల్మన్ గేమ్ నీలాంటి గొప్ప క్రికెటర్‌ను కచ్చితంగా మిస్ అవుతోంది. వరల్డ్ క్రికెట్లో మీ గొప్పతనం గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది.నిజంగా మీరు గోట్(గ్రేటేస్ట్ ఆల్‌టైమ్)" అని ఎక్స్‌లో బాబర్ రాసుకొచ్చాడు. అయితే ఇక్కడే బాబర్ తప్పు చేశాడు. అస్సలు కట్టర్స్ అనేవి ఆండర్సన్ బౌలింగ్ శైలికి సంబంధం లేదు. అతడు ఎక్కువగా బంతిని స్వింగ్ చేస్తాడు. దీంతో బాబర్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు.అయితే తన తప్పును గ్రహించిన బాబర్ పోస్ట్‌ను డిలీట్ చేసి కొత్తగా మళ్లీ పోస్ట్ చేశాడు. ఈ సారి మీ స్వింగ్‌ను ఎదుర్కొవడం విశేషం అంటూ రాసుకొచ్చాడు. బాబర్ తొలుత పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటకి నెటిజన్లు మాత్రం స్క్రీన్ షాట్లు తీసి పాక్ కెప్టెన్‌ను తెగ ఆడేసికుంటున్నారు. ఇనాళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నావు.. నీవు మారవా బాబర్ అంటే కామెంట్లు చేస్తున్నారు. It was a privilege to face your swing, Jimmy!The beautiful game will now miss one of its greatest. Your incredible service to the sport has been nothing short of remarkable. Huge respect for you, GOAT 🫡 pic.twitter.com/fE2NMz4Iey— Babar Azam (@babarazam258) July 12, 2024 -
బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!
వరుస పరాభవాలతో డీలా పడ్డ పాకిస్తాన్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా జాసెన్ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించిన పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రక్షాళనపైనా దృష్టి సారించినట్లు సమాచారం.బాబర్ ఆజంపై వేటు?ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజంపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. సారథిగా అతడిని తప్పించేందుకు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించిన పీసీబీ.. టీ20 సారథిగా షాహిన్ ఆఫ్రిదిని నియమించింది.ఈసారి కూడా చేదు అనుభవమేఅయితే, షాహిన్ కెప్టెన్‌గా ఆకట్టుకోకపోవడంతో టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందే బాబర్ ఆజంకు తిరిగి వన్డే, టీ20 నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. కానీ.. ఈసారి కూడా అతడికి చేదు అనుభవమే ఎదురైంది.గత టీ20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన బాబర్ ఆజం.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం గ్రూప్ దశ దాటకుండానే పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.అదే విధంగా.. బంధుప్రీతికి తావు లేకుండా జట్టును ఎంపిక చేయాలంటూ ఆజం ఖాన్ వంటి వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఆటగాళ్ల ఫిట్నెస్, క్రమశిక్షణ తదితర అంశాలకు సంబంధించి ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, ఛీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్‌లను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. కిర్‌స్టన్ నిర్ణయం మేరకేఅదే విధంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విషయంలో కిర్‌స్టన్ నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాబర్ ఆజంపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోందని పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు.. దేశవాళీ క్రికెట్ స్వరూపం గురించి మాజీ క్రికెటర్లతో చర్చించి రూట్‌మ్యాప్ తయారు చేయాలని పీసీబీ నిర్ణయించినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్‌ను కలిసిఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బాగు కోరే 30- 35 మంది అంతర్జాతీయ క్రికెటర్లు పీసీబీ చైర్మన్‌ను సోమవారం కలిసి తమ సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధమైనట్లు జియో న్యూస్ వెల్లడించింది. కాగా పాకిస్తాన్ తదుపరి తమ పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే.చదవండి: BCCI: ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే? -
క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. వీడియో వైరల్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం యార్క్‌షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఆటగాడు షాన్ మసూద్ ఒకే బంతికి హిట్ వికెట్‌తో పాటు రనౌటయ్యాడు.కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) నిబంధనల కారణంగా మసూద్ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు.అసలేం జరిగిందంటే?యార్క్‌షైర్ ఇన్నింగ్స్ 15వ వేసిన బ్లాథర్విక్ బౌలింగ్‌లో మూడో బంతిని షాన్ మసూద్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన మసూద్ తన కాలితో స్టంప్స్‌ను తాకాడు. దీంతో బెయిల్స్ కిందపడిపోయాయి. ఈ క్రమంలో తన ఔట్ అని గ్రహించిన మసూద్.. నాన్‌స్ట్రైకర్ జోరూట్ రన్‌కు పరిగెత్తుకుంటూ వచ్చినప్పటకి తను మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే అంతలోనే అంపైర్ నో బాల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో మసూద్ కూడా నాన్‌స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. కాగా అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దీంతో మసూద్ రనౌటయ్యాని నిరాశచెందాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా సిగ్నల్ ఇచ్చి అందరిని గందరగోళానికి గురిచేశాడు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) రూల్స్ ప్రకారమే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.రూల్స్ ఏం చెబుతున్నాయి..?ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్ ఔట్ ఇవ్వకుండా బ్యాటర్ తనంతట తానే ఔట్ అయినట్లు తప్పుగా భావిస్తే అంపైర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటౌట్ ఇవ్వవచ్చు. మసూద్ విషయంలో కూడా అదే జరిగింది. తన హిట్‌వికెట్ అయ్యాడని భావించిన మసూద్ రన్‌కు పరిగెత్తి మధ్యలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రనౌటయ్యాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మసూద్ అలా చేయలేదని భావించిన అంపైర్ నౌటౌట్‌గా ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో హిట్‌వికెట్‌ను కూడా అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో మసూద్ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే Shan Masood steps on his stumps off a no ball, Lancashire take the bails off at the other end - but Masood remained not out under law 31.7 pic.twitter.com/yQG6gP6Rac— Vitality Blast (@VitalityBlast) June 20, 2024 -
16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జవేరియా ఖాన్ 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల జవేరియా ఖాన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇవాళ (మార్చి 21) ప్రకటించింది. జవేరియా 2008-2023 మధ్యలో 116 వన్డేలు, 112 టీ20లు ఆడింది. ఈమె వన్డేల్లో 2 శతకాలు, 15 అర్దశతకాల సాయంతో 2885 పరుగులు.. టీ20ల్లో 10 అర్దశతకాల సాయంతో 2018 పరుగులు చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన జవేరియా.. వన్డేల్లో 17, టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టింది. తన కెరీర్లో ఫీల్డర్‌గానూ చురుకైన పాత్ర పోషించిన జవేరియా వన్డేల్లో 34 క్యాచ్‌లు, 13 రనౌట్లు.. టీ20ల్లో 16 క్యాచ్‌లు, 10 రనౌట్లు చేసింది. 17 వన్డేలు, 16 టీ20ల్లో పాక్ జాతీయ జట్టుకు సారధ్యం వహించిన జవేరియా .. ప్రస్తుత పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్‌కు డిప్యూటీగానూ (వైస్ కెప్టెన్) వ్యవహరించింది. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. డాషింగ్ బ్యాటర్‌గా పేరున్న అహ్మద్ పాక్ తరఫున 41 టెస్ట్‌లు ఆడి ఐదు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అహ్మద్ పాక్ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు. 1958లో వెస్టిండీస్‌తో జరిగిన బ్రిడ్జ్‌టౌన్ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన అహ్మద్.. తన స్వల్ప కెరీర్లో మూడు మ్యాచ్‌ల్లో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అహ్మద్ క్రికెట్ కెరీర్‌కు 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే పుల్ స్టాప్ పడింది. 1972-73 ఆస్ట్రేలియా టూర్లో అహ్మద్ తన చివరి టెస్ట్ మ్యాచ్ (మెల్బోర్న్) ఆడాడు. ఫిట్నెస్ విషయంలో క్రికెట్ బోర్డుకు తప్పుడు సమాచారం అందించాడన్న కారణంగా అతని కెరీర్‌కు అర్దంతంగా ఎండ్ కార్డ్ పడింది. పాక్ దిగ్గజం హనీఫ్ ముహమ్మద్ విండీస్‌పై చారిత్రక ట్రిపుల్ సెంచరీ (337) సాధించిన ఇన్నింగ్స్‌లో అహ్మద్ అతని భాగస్వామిగా ఉన్నాడు. ఆ ఇన్నింగ్స్‌లో అహ్మద్ 65 పరుగులు చేశాడు. అహ్మద్ పాక్ జాతీయ జట్టుకు ఆరో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అహ్మద్ సారధ్యం వహించిన మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. సయీద్ అహ్మద్ మరణవార్తను ప్రస్తుత పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వ్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేశారు. సయీద్ అహ్మద్ సోదరుడు యూనుస్ అహ్మద్ కూడా పాక్ టెస్ట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. యూనుస్ పాక్ తరఫున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 1987లో భారత్‌లో పర్యటించిన పాక్ జట్టులో యూనస్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ పర్యటనలో పాక్‌కు ఇమ్రాన్ ఖాన్ సారథ్యం వహించాడు. -
పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మళ్లీ కెప్టెన్‌గా బాబర్ ఆజం!?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మెన్‌గా మొహ్సిన్ నఖ్వీ ఎంపికైన సంగతి తెలిసిందే. గత నెలలో పీసీబీ ఛీప్ పదవి నుంచి తప్పుకున్న జకా అష్రఫ్ స్ధానాన్ని మొహ్సిన్ నఖ్వీ భర్తీ చేశాడు. అతడు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. అయితే పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నఖ్వీ.. ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జట్టు పగ్గాలని తిరిగి స్టార్ ఆటగాడు బాబర్‌కు అప్పజెప్పాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్ జకా అష్రఫ్.. పాక్ టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదిని నియమించాడు. అయితే కెప్టెన్సీలో మార్పులు చోటుచేసుకున్నాక పాకిస్తాన్ జట్టు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కొత్త కెప్టెన్లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు వెళ్లిన పాకిస్తాన్.. అక్కడ ఘోర ప్రదర్శన కనబరిచింది. మసూద్ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్(3 టెస్టులు) అవ్వగా, అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయింది. దీంతో పాక్ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ బాబర్‌కే అప్పజెప్పాలని నఖ్వీ ఆలోచిస్తున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 17 నుంచి జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ అనంతరం పాక్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే బాబర్ తిరిగి పాక్ నాయకత్వ బాధ్యతలు చేపడతాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. బాబర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. -
బాబర్ ఆజమ్ విశ్వరూపం.. సుడిగాలి శతకంతో విధ్వంసం
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 7) జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్టయికర్స్ ఆటగాడు, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్ కెప్టెన్.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Colombo Strikers win the last over thriller in Pallekele. Babar Azam leads the batting side with a sensational century. pic.twitter.com/sM8bkYU1jT — CricTracker (@Cricketracker) August 7, 2023 ఆఖరి ఓవర్లో వేగంగా మ్యాచ్‌ను ముగించే క్రమంలో బాబర్ (104) ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మహ్మద్ నవాజ్ 4 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 14 పరుగులు చేసి కొలంబోను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బాబర్‌కు జతగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన పథుమ్ నిస్సంక (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్) అర్ధశతకంతో రాణించగా.. నువనిదు ఫెర్నాండో (8) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. నవాజ్‌తో పాటు చమిక కరుణరత్నే (2) అజేయంగా నిలిచారు. ఆఖరి ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాది నవాజ్ కొలొంబోను గెలిపించాడు. గాలే బౌలర్లలో తబ్రేజ్ షంషి 2, కసున్ రజిత ఓ వికెట్ పడగొట్టారు. Kasun Rajitha ends Babar Azam's masterclass. Colombo Strikers need a miracle to win the game. pic.twitter.com/btIUW54X9p — CricTracker (@Cricketracker) August 7, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలే టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (19 బంతుల్లో 36; 4 ఫోర్లు,2 సిక్సర్లు), షెవాన్ డేనియల్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), భానుక రాజపక్స (31 బంతుల్లో 30; 2 ఫోర్లు), టిమ్ సీఫర్ట్ (35 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, రమేశ్ మెండిస్, సందకన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన బాబర్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాక్ కెప్టెన్
PAK VS NZ 4th ODI: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాబర్ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. న్యూజిలాండ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో 19 పరుగుల వద్ద బాబర్ 5000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. గతేడాది బాబర్.. హషీమ్ ఆమ్లా పేరిటే ఉన్న వేగవంతమైన 4000 పరుగుల రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఆమ్లా 81 ఇన్నింగ్స్‌ల్లో ఆ ఫీట్‌ను సాధిస్తే, బాబార్ 82 ఇన్నింగ్స్‌ల్లో ఆ మైలురాయిని అధిగమించాడు. గత రెండేళ్లుగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బాబర్.. 5000 పరుగులు పూర్తి చేసిన 14వ పాకిస్తానీ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. 28 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఫకర్ జమాన్ (14) త్వరగా ఔటవ్వగా.. షాన్ మసూద్ (44), మహ్మద్ రిజ్వాన్ (24) పర్వాలేదనిపించారు. బాబర్ ఆజమ్ (55), అఘా సల్మాన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను పాక్ ఇదివరకే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కాకుండా సిరీస్‌లో మరో మ్యాచ్ (ఐదో వన్డే) మిగిలి ఉంది. అంతకుముందు ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ డ్రాగా ( 2-2) ముగిసింది. -
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు అత్యున్నత పురస్కారం
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు అతని దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. పాకిస్తాన్ క్రికెట్‌కు బాబర్ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ దేశ ప్రభుత్వం అతన్ని సితార-ఎ-ఇమ్తియాజ్ అవార్డుతో సత్కరించింది. గతంలో పాక్ క్రికెటర్లు మిస్బా-ఉల్-హక్, యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రిదిలకు మాత్రమే సితార-ఎ-ఇమ్తియాజ్ పురస్కారం లభించింది. Babar Azam receiving the Sitara-e-Imtiaz award 🏅#Cricket #Pakistan pic.twitter.com/KO5BZLQjyq — Cricket Pakistan (@cricketpakcompk) March 23, 2023 ఈ అవార్డు అందుకున్న అత్యంత పిన్న వయస్కుడు బాబర్ ఆజమే (28) కావడం విశేషం. ఈ రోజు (మార్చి 23) లాహోర్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాబర్ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆఫ్ఘనిస్తాన్‌తో రేపటి నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు బాబర్. Immense honour to have received Sitara-e-Imtiaz in the presence of my mother and father. This award is for my parents, fans and the people of 🇵🇰 pic.twitter.com/Gafwlu3rUC — Babar Azam (@babarazam258) March 23, 2023 కాగా, అసాధారణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన బాబర్.. పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఆ దేశ క్రికెటింగ్ విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. బాబర్ సొంతంగా రాణిస్తూ, జట్టు సభ్యులందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను అనేక అవార్డులు, రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 2022 ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2022 ఐసీసీ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ (వన్డే టీమ్) వంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఉన్నాయి. -
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బాబర్ ఆజం
2022 ఏడాదికి గానూ ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలిచాడు. గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు చేసిన బాబర్ ఖాతాలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్ ఆజం వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం బాబర్ ఆజం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో(బ్యాటింగ్ విభాగం) నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక 2022 ఐసీసీ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచిన విషయం విధితమే. ఇక వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో నిలిచిన ఆడమ్ జంపా, సికిందర్ రజా, వెస్టిండీస్ ఓపెనర్ షెయ్ హోప్‌ల కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకొని బాబర్ ఆజం తొలి స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా రెండో ఏడాది వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుడు సొంతం చేసుకున్న ఆటగాడిగా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు. దీంతో పాటు బాబర్ ఆజం 2022 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులోనూ ఉన్నాడు. ఈ అవార్డుకు బాబర్ ఆజంతో పాటు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడుతున్నారు ఇంగ్లండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వార్త్.. ఐసీసీ 2022 అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అంపైర్‌కు అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో 2019లోనూ ఇల్లింగ్‌వార్త్ విజేతగా నిలిచాడు.సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు కైవసం చేసుకున్నాడు. గతేడాది 36 టెస్టు వికెట్లు తీసిన మార్కో జాన్సెన్.. వన్డేల్లో రెండు, టి20ల్లో ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 234 పరుగులు సాధించాడు. Babar Azam is the ICC Men's ODI Cricketer of the Year for the second year in a row ✨#ICCAwards pic.twitter.com/JcTIEtwwPe — Pakistan Cricket (@TheRealPCB) January 26, 2023 చదవండి: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు 'సూర్య లేకుంటే మూడు ఫార్మాట్లు లేనట్లే' -
సహచరుడి గర్ల్ ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్.. స్పందించిన బాబర్ ఆజమ్
Babar Azam Honey Trap Episode: సహచరుడి గర్ల్ ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్.. తాజాగా ఈ ఉదంతంపై స్పందించాడు. తనపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ.. సుఖంగా ఉండేందుకు మరీ అంత రిస్క్ చేయనన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేస్తూ, తనపై వస్తున్న ఆరోపణలకు పరోక్షంగా చెక్ పెట్టాడు. Doesn't take too much to be happy ☺️ pic.twitter.com/udKmZTHl6V — Babar Azam (@babarazam258) January 16, 2023 నదీ తీరాన, ఆహ్లాదకరమైన వాతావరణంలో తీసుకున్న తన ఫోటోను షేర్ చేస్తూ బాబర్ ఈ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌లో బాబర్ నవ్వుతూ ఇచ్చిన పోజ్‌ను బట్టి చూస్తే.. తనపై వస్తున్న ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు అభిమానులు కూడా బాబర్‌కు అండగా నిలిచారు. సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియోలో ఉన్నది బాబర్ కాదని, గిట్టని వారు మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పట్టీపట్టనట్లుగా ఉండటంతో బాబర్‌కు మద్దతుగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. The war against Babar Azam has started 😢#BabarAzam𓃵 #BabarAzam pic.twitter.com/JOSmHd9A32 — Muhammad Noman (@nomanedits) January 15, 2023 కాగా, వైరలవుతున్న వీడియోలో బాబర్.. తన సహచరుడి (పాక్ జట్టులో సభ్యుడు) గర్ల్ ఫ్రెండ్‌తో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నియో యాదవ్ అనే ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో బాబర్, తన సహచర పాకిస్తాన్ ఆటగాడి గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చాటింగ్ చేస్తున్నాడు. తనతో చాటింగ్ కొనసాగిస్తే.. సదరు అమ్మాయి ప్రియుడికి జట్టులో స్థానానికి ఢోకా ఉండదని ప్రామిస్ చేశాడు. ఈ వీడియోతో పాటు పలు అసభ్య చాట్ మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, బాబర్‌కు సంబంధించిన పర్సనల్ ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటికే స్వదేశంలో వరుస సిరీస్‌ల్లో జట్టును గెలిపించలేక, కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో ఉన్న బాబర్‌కు తాజా ఉదంతం మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. -
బాబర్ ఆజమ్‌పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నాయకత్వ మార్పు చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజమ్‌ను దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్‌కు పట్టం కట్టేందుకు సర్వం సిద్ధమైనట్లు పాక్ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు వెటరన్ వికెట్‌కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ కెప్టెన్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వన్డే, టీ20ల్లో షాన్ మసూద్‌కు కెప్టెన్సీ అప్పగించినా.. టెస్ట్‌ల్లో మాత్రం సర్ఫరాజ్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయంపై నజీం నేథీ నేతృత్వంలోని పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పాక్ క్రికెట్ సర్కిల్స్‌లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాక్ మాజీలు, ఆ దేశ క్రికెట్ విశ్లేషకులేమో మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని సమాచారం. ఏదిఏమైనప్పటికీ పీసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాక్ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమిపాలైన పాక్.. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయిన పాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై వేటు అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, పీసీబీ కొద్దికాలం క్రితమే బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తొలుత అధ్యక్షుడు రమీజ్ రజాపై వేటు వేసి నజీం సేథికి బాధ్యతలు అప్పగించిన పీసీబీ.. ఇటీవలే షాహిద్ అఫ్రిదిని జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. -
'ఏంటి బాబర్ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై ఆడుకో'
ఆసియాకప్-2022లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు,. ఈ మెగా ఈవెంట్ అఖరి సూపర్-4 మ్యాచ్‌లోనూ బాబర్ అదే ఆట తీరును కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న ఆజాం 30 పరుగుల చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆది నుంచే లంక బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ బాబర్.. అఖరికి హాసరంగా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. తొలి మ్యాచ్‌లో భారత్‌పై కేవలం 10 పరుగులు చేసి ఔటైన ఆజం..తర్వాతి మ్యాచ్‌లో పసికూన హాంగ్‌కాంగ్‌పై కూడా 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భారత్‌తో జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఏకంగా డకౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆజం తన టీ20 నెం1 ర్యాంక్‌ను కోల్పోయాడు. Babar azam aj apni taraf se Virat kohli ban'na chah raha tha lkn usy aj Rohit sharma ki trha rest krni chahye thi. #PAKvsSL — Huzaifa (@huzaifadotcom) September 9, 2022 ఈ క్రమంలో దారుణంగా విఫలమవుతున్న ఆజాంను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి పసికూనలపైనే బాబర్ సెంచరీలు సాధిస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబర్ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై ఆడుకో' అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఇక ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. NO TOSS NO PARTY.😂#teampakistan #BabarAzam #AsiaCup2022 #AsiaCup2022Final #SLvPAK — Shraddha 💖 (@Shraddha__queen) September 9, 2022 చదవండి: Asia Cup 2022: గ్రౌండ్లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్ షాక్! -
పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు
Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 1994 పాక్ పర్యటన సందర్భంగా నాటి పాక్ కెప్టెన్ సలీం మాలిక్ తనకు లంచం(2, 76,000 అమెరికన్ డాలర్లు) ఆఫర్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సామర్ధ్యం మేరకు ఆడకూడదని, తనతో పాటు మరో ఆసీస్ ఆటగాడు టిమ్ మేకు వార్నింగ్ కూడా ఇచ్చాడని బాంబు పేల్చాడు. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఈ సంచలన ఆరోపణలు చేశాడు. నాటి పాక్ పర్యటనలో భాగంగా కరాచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సామర్ధ్యం మేరకు బౌలింగ్ చేయకూడదని, వికెట్లు తీసే ప్రయత్నం చేయకుండా వైడ్ బంతులు విసరాలని తనతో పాటు టిమ్ మేకు సలీం మాలిక్ ప్రలోభాలతో కూడిన వార్నింగ్ ఇచ్చాడని వార్న్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో పాక్ ఓటమి అంచుల్లో ఉండిందని, అదే జరిగితే ఆ దేశ ఆటగాళ్ల ఇళ్లపై అభిమానులు దాడి చేస్తారని మాలిక్ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడని వార్న్ తెలిపాడు. సదరు విషయాన్ని తాను, మే.. నాటి ఆసీస్ కెప్టెన్ మార్క్ టేలర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నాడు. వార్న్ చేసిన ఈ వ్యాఖ్యలతో పాక్ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువు అయిన వార్న్ ఆరోపణల్లో ఎంత మేరకు నిజం ఉందో వేచి చూడాలి. కాగా, వార్న్.. 2003 ప్రపంచకప్‌కు ముందు డోపింగ్ పరీక్షలో పట్టుబడి ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: ఎగిరెగిరిపడకండి.. ఇంకో మ్యాచ్ ఉంది.. సఫారీలకు బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ -
పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన
Sunil Gavaskar Hails Babar Azam: గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్‌పై దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఈ దశాబ్దపు అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని కొనియాడాడు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో పరుగులు చేస్తూ.. సమకాలీకులైన విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లతో పోటీపడుతున్నాడని అన్నాడు. బాబర్ ఇదే ఫామ్‌ను కెరీర్ ముగిసే వరకు కొనసాగించగలిగితే.. ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచిపోతాడని జోస్యం చెప్పాడు. అయితే, ఫిట్నెస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పాక్ జట్టును బాబర్ అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. అతని స్ఫూర్తిదాయకమైన, ప్రశాంతమైన నాయకత్వ శైలి అమోఘమని ఆకాశానికెత్తాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021 సూపర్-12లో అజేయ జట్టుగా నిలిచి సెమీస్‌కు చేరుకున్న పాక్.. ఇవాళ(నవంబర్ 11) రెండో సెమీ ఫైనల్స్‌లో బలమైన ఆసీస్ జట్టుతో తలపడనుంది. చదవండి: Siraj: అబ్బాయిలు ఏడ్వకూడదని నాన్న చెప్పేవాడు.. కానీ ఆపుకోలేక..! -
త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న పాక్ కెప్టెన్
లాహోర్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(26) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా మామ కూతురితో ప్రేమాయణం సాగిస్తున్న ఈ ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్.. వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడని సమాచారం. ప్రస్తుతానికి ఇరు కుటుంబాల మధ్య మాటలు పూర్తయ్యాయని, పెద్దలు పరస్పర అంగీకారానికి వచ్చాక, వచ్చే ఏడాది ఆరంభంలో వీరి జంట ఓక్కటి కాబోతుందని బాబర్ సన్నిహితులు స్థానిక మీడియాకు తెలిపారు. కాగా, బాబర్ పెళ్లి విషయమై సహచర ఆటగాడు, పాక్ మాజీ కెప్టెన్ అజహర్ అలీ ఇటీవలే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌కు మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా అని ట్విటర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను స్పందిస్తూ.. త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించాడు. అయితే యాదృచ్చికంగా అజహర్ అలీ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే పాక్ కెప్టెన్ పెళ్లి విషయమై వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, గత కొద్ది కాలంగా కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న పాక్ కెప్టెన్.. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. ఇటీవలే జింబాబ్వే పర్యటనను ముగంచుకుని స్వదేశానికి చేరుకున్న బాబర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. చదవండి: కుటుంబ సమేతంగా ఇంగ్లండ్‌కు పయనం! -
Babar Azam: నయా నంబర్‌వన్
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 94 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు తగిన ప్రతిఫలం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి బాబర్ ఆజమ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. 2015 నుంచి అంతర్జాతీయ వన్డేలు ఆడుతున్న 26 ఏళ్ల ఆజమ్ ఖాతాలో ప్రస్తుతం 865 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆజమ్ టాప్ ర్యాంక్‌లోకి రావడంతో 1,258 రోజుల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 857 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. 2017 అక్టోబర్ నుంచి కోహ్లి వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 825 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో, రాస్ టేలర్ (న్యూజిలాండ్–801 పాయింట్లు) నాలుగో స్థానంలో, ఫించ్ (ఆస్ట్రేలియా–791 పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 80 వన్డేలు ఆడిన బాబర్ ఆజమ్ 56.83 సగటుతో 3,808 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో బాబర్ ఆజమ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ ఐదు కాగా ప్రస్తుతం ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు. టి20ల్లో గతంలో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ఆజమ్ ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు. -
'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు'
కరాచీ : పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ తనను మోసం చేయడమేగాక లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది.శనివారం మీడియా సమావేశంలో సదరు మహిళ బాబర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి : రానున్న రోజుల్లో స్మిత్‌తో టీమిండియాకు కష్టమే) 'బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాక నన్ను కొట్టి.. శారీరకంగా హింసకు గురిచేశాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని మహిళ పేర్కొంది. So this lady has made accusations against Babar Azam "he promised to marry me, he got me pregnant, he beat me up, he threatened me and he used me" Video courtesy 24NewsHD pic.twitter.com/PTkvdM4WW2 — Saj Sadiq (@Saj_PakPassion) November 28, 2020 అయితే మహిళ చేసిన ఆరోపణలపై బాబార్ అజమ్ స్పందించలేదు.మహిళ చెప్పినదాంట్లో నిజమెంత అనేది పక్కనబడితే.. బాబర్‌పై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పేరు సంపాదించడానికి ఇలాంటి పనికిరాని ఆరోపణలు చేస్తుందని బాబర్ అభిమానులు మండిపడుతున్నారు. మహిళ చేసిన ఆరోపణలపై పాక్ క్రికెట్ బోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. (చదవండి : తప్పు నాదే.. క్షమించండి : గిల్‌క్రిస్ట్) కాగా కొద్ది రోజుల క్రితమే బాబర్ అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం పాక్ జట్టుతో కలిసి బాబర్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు. వచ్చే నెలలో కివీస్‌తో జరిగే టీ20, టెస్టు సిరీస్ కోసం పాక్ జట్టు అక్కడికి చేరుకుంది. కరోనా నేపథ్యంలో వారు ప్రస్తుతం 14 రోజుల ఐసోలేషన్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న కివీస్, పాక్‌ల మధ్య మ్యాచ్‌లు ప్రారంభం కానుంది. అయితే తాజాగా పాక్ టీమ్‌లో ఏడుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మిగతా ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌కే పరిమితం అయ్యారు. -
కోహ్లితో పోల్చొద్దు: పాక్ కెప్టెన్ బాబర్
కరాచీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లితో తనను పోల్చుతుండటంతో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆక్రోశించాడు. విరాట్‌కు బదులుగా పాక్ దిగ్గజాలతో పోలిస్తే తనకు సంతోషమన్నాడు. ‘మీరు నన్ను మియాందాద్, మొహమ్మద్ యూసుఫ్, యూనిస్ఖాన్లతో పోలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. కోహ్లితో లేక ఇతర భారత క్రికెటర్లతో నన్నెందుకు పోలుస్తారు’ అని బాబర్ వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 50కి పైగా సగటుతో 16 సెంచరీలు, 26 టెస్టుల్లో 45.12 సగటుతో 1850 పరుగులు సాధించాడు. మరోవై పు కోహ్లి అన్ని ఫార్మాట్లలో 50 సగటుతో 70 సెంచ రీలు చేశాడు. -
‘సర్ఫరాజ్ స్లీప్ ఫీల్డర్’
మాంచెస్టర్: పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆవలింతలపై మీమ్‌లు... అతని శరీరంపై జోకులు... సర్ఫరాజ్ కీపర్ మాత్రమే కాదు, ‘స్లీప్’ ఫీల్డర్ అంటూ అతని ఆవలింతలపై వ్యంగ్యాస్త్రాలు... జట్టు సభ్యుల ఫిట్‌నెస్‌పై పరిహాసాలు... దేశ ప్రధాని మాటనూ పట్టించుకోలేదని విసుర్లు, మ్యాచ్‌కు ముందు రోజు బయటకు షికార్లు చేయడంపై ఆగ్రహావేశాలు... ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్తాన్‌పై విమర్శలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. చిరకాల ప్రత్యర్థి చేతిలో మళ్లీ ఓడటంతో ఆ దేశ అభిమానులు తమ కోపాన్ని ఆపుకోలేకపోయారు. సహజంగానే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మైదానంలో మ్యాచ్ చూసిన అనంతరం ఒక వీరాభిమాని తన ఆవేదనను ప్రదర్శిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఎన్నో సమస్యలు ఉన్న పాకిస్తాన్లో మాకు క్రికెట్ కొంత సాంత్వననిస్తుంది. ఎంతో డబ్బు పెట్టి, ఇబ్బందులు పడి ఎన్నో ఆశలతో ఇక్కడికొస్తే ఇలాంటి ఆట ఆడతారా? ఆటగాళ్లకు కనీస ఫిట్నెస్ కూడా లేదు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి వారు పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీమ్‌లు తిన్నారని విన్నాను. ఎవరైనా ఆటగాళ్లు ఇలాంటి తిండి తింటారా? వీరు క్రికెట్లో కాదు కుస్తీలో పోటీ పడాల్సింది. సర్ఫరాజ్ అయితే నిద్ర మాత్రలు వేసుకున్నట్లు కనిపించాడు.అతను మమ్మల్ని మోసం చేశాడు’ అని సదరు అభిమాని ఏడ్చేశాడు. పాక్ క్రికెటర్లు బేకరీ, ఐస్‌క్రీమ్ షాప్‌కు వెళ్లిన ఫోటోలు, షోయబ్ మాలిక్ తన భార్య సానియా మీర్జా, ఇద్దరు సహచరులతో కలిసి ‘హుక్కా కేఫ్’లో ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడంతో అభిమానుల ఆగ్రహం మరింత పెరిగింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిని ఖండించింది. ప్రచారంలో ఉన్న వీడియోలు, ఫోటోలు మ్యాచ్‌కు రెండు రోజుల ముందు (శుక్రవారం) నాటివని... మ్యాచ్‌కు ముందు రాత్రి జట్టు సభ్యులంతా నిర్ణీత సమయానికి గదుల్లో ఉన్నారని, నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ఇమ్రాన్ సూచనను పట్టించుకోలేదని... పాకిస్తాన్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని దేశానికి ప్రపంచ కప్ అందించిన దిగ్గజం, ప్రస్తుతం ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ మ్యాచ్‌కు ముందు సూచించాడు. ఛేదనలో పాక్ బలహీనం కాబట్టి మాజీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సర్ఫరాజ్ మాత్రం ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. దీనిపై విమర్శలకు తోడు ‘ఇమ్రాన్ ఇంగ్లీష్‌లో రాశాడు కాబట్టి సర్ఫరాజ్‌కు అర్థం కాలేదు’ అంటూ అభిమానులు దెప్పిపొడిచారు. మరోవైపు జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలే ఓటమికి కారణమయ్యాయని కూడా పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. 90ల్లో పాకిస్తాన్ జట్టు చాలా బలంగా ఉండి భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి భారత్ మెరుగ్గా తయారైంది. ఇలాంటి మ్యాచ్‌లలో మేం ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాం. మా జట్టు అన్ని రంగాల్లో విఫలమైంది. రెండు రోజులుగా పిచ్ కప్పి ఉంచారు. తేమ ఉండటంతో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నా. అయితే మా ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాం. మా శారీరక భాష బాగా లేదంటే ఒప్పుకోను. ఆటగాళ్లంతా బాగానే ప్రయత్నించారు. మా ఫీల్డింగ్ బాగా లేక రోహిత్ రెండు సార్లు రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. అతను ఔటైతే పరిస్థితి భిన్నంగా ఉండేది. మా ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా బాగుంది. –సర్ఫరాజ్ అహ్మద్, పాక్ కెప్టెన్ రెస్టారెంట్లో షోయబ్ మాలిక్, సానియా, వహాబ్ రియాజ్ తదితరులు -
'బౌలింగ్ మా బలం.. భారత్‌తో ఫైట్‌కు రెడీ'
ఆమిర్ బెస్ట్ బౌలర్ అని వ్యాఖ్య కోల్‌కతా: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌పై షాహిద్ ఆఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ఉత్తమ బౌలర్ అని, టాప్ అంతర్జాతీయ పేసర్లలో అతడు ఇప్పటికే చోటు సంపాదించాడని పేర్కొన్నాడు. ఆమిర్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఇటీవల భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రోహిత్ వ్యాఖ్యల గురించి అతన్నే అడుగాలని, తమకు మాత్రం ఆమిర్ బెస్ట్ బౌలర్ అని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ అఫ్రిది పేర్కొన్నాడు. వన్డేల్లోనైనా, ట్వంటీ-20ల్లోనైనా వరల్డ్ కప్‌లో ఇంతవరకు భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించలేదు. ఇది తమకు నెగిటివ్ అంశమే అయినా, సానుకూల దృక్పథంలో ముందుకుసాగుతామని, ఇటీవలికాలంలో భారత జట్టు మంచి ఆటతీరును కనబరుస్తున్నదని అతను పేర్కొన్నాడు. ఈ నెల 19న ఈడెన్ గార్డెన్స్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట పాక్ జట్టు 16వతేదీన క్వాలిఫైయింగ్‌లో అర్హత సాధించిన జట్టు (బంగ్లాదేశ్ కావొచ్చు)తో ఆడనుంది. ఆ తర్వాత భారత్‌తో పోరు ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచుతోపాటు, రెండో మ్యాచును అత్యంత కీలకంగా భావిస్తున్నామని, ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ ఇరుజట్లకూ అనుకూలించేవిధంగా ఉందని పేర్కొన్నాడు. దాయాది భారత్‌తో మ్యాచు కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే లాహోర్‌లో తగినంత శిక్షణ తీసుకున్న నేపథ్యంలో తమ జట్టు భారత్‌కు రావడం ఆలస్యమైనా.. ఇది తమ ఆటతీరుపై ప్రభావం చూపబోదని, డెఫినెట్‌గా తాము బాగా ఆడుతామని చెప్పాడు. భారత బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య ప్రధానంగా పోరు ఉండనుందని, ఆమిర్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ షమీతో తమ బౌలింగ్ ఆటాక్ పటిష్టంగా ఉందని, తమ బ్యాట్స్‌మెన్ బాగా ఆడి.. చక్కని స్కోరు చేస్తే.. దానిని కాపాడుకునే బౌలింగ్ సామర్థ్యం జట్టులో ఉందని అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు.