Twitter Reacts as Babar Azam Struggles Against Sri Lankan Bowlers in Asia Cup 2022 - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: 'ఏంటి బాబర్‌ నీ ఆట..? వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై ఆడుకో'

Published Sat, Sep 10 2022 1:04 PM | Last Updated on Sat, Sep 10 2022 3:08 PM

Twitter reacts as Babar Azam struggles against Sri Lankan bowlers in Asia Cup 2022 - Sakshi

ఆసియాకప్‌-2022లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు,. ఈ మెగా ఈవెంట్‌ అఖరి సూపర్‌-4 మ్యాచ్‌లోనూ బాబర్‌ అదే ఆట తీరును కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో 29 బంతులు ఎదుర్కొన్న ఆజాం 30 పరుగుల చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఆది నుంచే లంక బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ బాబర్‌.. అఖరికి హాసరంగా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.

తొలి మ్యాచ్‌లో భారత్‌పై కేవలం 10 పరుగులు చేసి ఔటైన ఆజం..తర్వాతి మ్యాచ్‌లో పసికూన హాంగ్‌కాంగ్‌పై కూడా 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం భారత్‌తో జరిగిన తొలి సూపర్‌-4 మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో ఏకంగా డకౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆజం తన టీ20 నెం1 ర్యాంక్‌ను కోల్పోయాడు.

ఈ క్రమంలో దారుణంగా విఫలమవుతున్న ఆజాంను నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. జింబాబ్వే, నెదర్లాండ్స్‌ వంటి పసికూనలపైనే బాబర్‌ సెంచరీలు సాధిస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ఏంటి బాబర్‌ నీ ఆట..?  వెళ్లి జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై ఆడుకో' అంటూ ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఆదివారం దుబాయ్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.


చదవండి: Asia Cup 2022: గ్రౌండ్‌లో గొడవపడ్డారు.. ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఐసీసీ బిగ్‌ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement