T20 World Cup 2021 Pakistan vs Australia Semi-Final: Sunil Gavaskar Said Babar Azam Can Be All-Time Great - Sakshi
Sakshi News home page

పాక్‌ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్‌.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన

Published Thu, Nov 11 2021 6:22 PM | Last Updated on Thu, Nov 11 2021 7:13 PM

If Babar Azam Remains Fit, He Will End Up As All Time Great Says Sunil Gavaskar - Sakshi

Sunil Gavaskar Hails Babar Azam: గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న పాకిస్థాన్‌ సారధి బాబర్‌ ఆజమ్‌పై దిగ్గజ బ్యాటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్‌ ఈ దశాబ్దపు అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని కొనియాడాడు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో పరుగులు చేస్తూ.. సమకాలీకులైన విరాట్‌ కోహ్లి, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌లతో పోటీపడుతున్నాడని అన్నాడు. బాబర్‌ ఇదే ఫామ్‌ను కెరీర్‌ ముగిసే వరకు కొనసాగించగలిగితే.. ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లలో ఒకడిగా నిలిచిపోతాడని జోస్యం చెప్పాడు. 

అయితే, ఫిట్‌నెస్‌ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌-2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పాక్‌ జట్టును బాబర్‌ అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. అతని స్ఫూర్తిదాయకమైన, ప్రశాంతమైన నాయకత్వ శైలి అమోఘమని ఆకాశానికెత్తాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021 సూపర్‌-12లో అజేయ జట్టుగా నిలిచి సెమీస్‌కు చేరుకున్న పాక్‌.. ఇవాళ(నవంబర్‌ 11) రెండో సెమీ ఫైనల్స్‌లో బలమైన ఆసీస్‌ జట్టుతో తలపడనుంది.  
చదవండి: Siraj: అబ్బాయిలు ఏడ్వకూడదని నాన్న చెప్పేవాడు.. కానీ ఆపుకోలేక..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement