పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు అతని దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. పాకిస్తాన్ క్రికెట్‌కు బాబర్ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ దేశ ప్రభుత్వం అతన్ని సితార-ఎ-ఇమ్తియాజ్ అవార్డుతో సత్కరించింది. గతంలో పాక్ క్రికెటర్లు మిస్బా-ఉల్-హక్, యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రిదిలకు మాత్రమే సితార-ఎ-ఇమ్తియాజ్ పురస్కారం లభించింది.
Babar Azam receiving the Sitara-e-Imtiaz award 🏅#Cricket #Pakistan pic.twitter.com/KO5BZLQjyq
— Cricket Pakistan (@cricketpakcompk) March 23, 2023
ఈ అవార్డు అందుకున్న అత్యంత పిన్న వయస్కుడు బాబర్ ఆజమే (28) కావడం విశేషం. ఈ రోజు (మార్చి 23) లాహోర్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాబర్ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆఫ్ఘనిస్తాన్‌తో రేపటి నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు బాబర్.
Immense honour to have received Sitara-e-Imtiaz in the presence of my mother and father.
— Babar Azam (@babarazam258) March 23, 2023
This award is for my parents, fans and the people of 🇵🇰 pic.twitter.com/Gafwlu3rUC
కాగా, అసాధారణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన బాబర్.. పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఆ దేశ క్రికెటింగ్ విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. బాబర్ సొంతంగా రాణిస్తూ, జట్టు సభ్యులందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను అనేక అవార్డులు, రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 2022 ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2022 ఐసీసీ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ (వన్డే టీమ్) వంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment