Babar Azam Slams First Hundred Of LPL 2023, Colombo Beat Galle By 7 Wickets - Sakshi
Sakshi News home page

LPL 2023 Colombo Vs Galle: బాబర్‌ ఆజమ్‌ విశ్వరూపం.. మెరుపు శతకంతో విధ్వంసం

Published Mon, Aug 7 2023 6:39 PM | Last Updated on Mon, Aug 7 2023 7:05 PM

Babar Azam Slams First Hundred Of LPL 2023, Colombo Beat Galle By 7 Wickets - Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో భాగంగా గాలే టైటాన్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 7) జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్టయికర్స్‌ ఆటగాడు, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. మెరుపు శతకంతో విధ్వంసం సృష్టించాడు. భారీ ఛేదనలో (189) పూనకాలు వచ్చినట్లు ఊగిపోయిన పాక్‌ కెప్టెన్‌.. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా కొలొంబో స్ట్రయికర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఆఖరి ఓవర్‌లో వేగంగా మ్యాచ్‌ను ముగించే క్రమంలో బాబర్‌ (104) ఔట్‌ కాగా.. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మహ్మద్‌ నవాజ్‌ 4 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 14 పరుగులు చేసి కొలంబోను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బాబర్‌కు జతగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన పథుమ్‌ నిస్సంక (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్‌) అర్ధశతకంతో రాణించగా.. నువనిదు ఫెర్నాండో (8) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. నవాజ్‌తో పాటు చమిక కరుణరత్నే (2) అజేయంగా నిలిచారు. ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి బౌండరీ బాది నవాజ్‌ కొలొంబోను గెలిపించాడు. గాలే బౌలర్లలో తబ్రేజ్‌ షంషి 2, కసున్‌ రజిత ఓ వికెట్‌ పడగొట్టారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గాలే టైటాన్స్‌.. లసిత్‌ క్రూస్‌పుల్లే (19 బంతుల్లో 36; 4 ఫోర్లు,2 సిక్సర్లు), షెవాన్‌ డేనియల్‌ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), భానుక రాజపక్స (31 బంతుల్లో 30; 2 ఫోర్లు), టిమ్‌ సీఫర్ట్‌ (35 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, రమేశ్‌ మెండిస్‌, సందకన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసి లీగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement