శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్తాన్ ఆధిక్యం సాధించింది. 221/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్.. లంచ్ విరామం సమయానికి అఘా సల్మాన్ (83) వికెట్ (ఆరో వికెట్) కోల్పోయి 313 పరుగులు చేసింది. సౌద్ షకీల్ అజేయ సెంచరీ (119)తో పాకిస్తాన్‌కు లీడ్ అందించాడు. ప్రస్తుతం ఆ జట్టు పరుగు ఆధిక్యంలో కొనసాగుతుంది. షకీల్‌కు జతగా నౌమన్ అలీ (13) క్రీజ్‌లో ఉన్నాడు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (19), ఇమామ్ ఉల్ హాక్ (1), కెప్టెన్ బాబర్ ఆజమ్ (13), సర్ఫరాజ్ అహ్మద్ (17) విఫలం కాగా.. షాన్ మసూద్ (39) పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 3, రమేశ్ మెండిస్ 2, కసున్ రజిత ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకే ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (64) అర్ధశతకంతో రాణించాడు.
లంక ఇన్నింగ్స్‌లో నిషాన్ మధుష్క (4), కుశాల్ మెండిస్ (12), దినేశ్ చండీమల్ (1), రమేశ్ మెండిస్ (5), ప్రభాత్ జయసూర్య (4), కసున్ రజిత (8) విఫలం కాగా.. కెప్టెన్ కరుణరత్నే (29), సమరవిక్రమ (36), విశ్వ ఫెర్నాండో (21 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment