![CWC 2023: Sri Lanka Have Never Beaten Pakistan At Mens ODI World Cup - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/10/Untitled-7.jpg.webp?itok=6xk7Styv)
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంలో ఉన్న పాక్ టోర్నీలో రెండో విజయంపై కన్నేయగా.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. పాక్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది.
పాక్‌పై ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు..
వన్డే ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంక.. పాక్‌పై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు. మెగా టోర్నీలో ఇరు జట్లు 7 సందర్భాల్లో ఎదురెదురుపడగా అన్ని సార్లు పాకిస్తాన్‌దే పైచేయిగా నిలిచింది. దీంతో నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాక్‌కు ఓటమి రుచి చూపించాలని శ్రీలంక జట్టు కసిగా ఉంది. మరోవైపు పాక్ ప్రపంచకప్‌లో శ్రీలంకపై తమ జైత్రయాత్రను కొనసాగించేందుకు ప్రణాళికలతో సిద్దంగా ఉంది.
ఓవరాల్‌గా కూడా పాక్‌దే పైచేయి..
వన్డే క్రికెట్‌లో ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై పాకిస్తాన్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 156 వన్డేల్లో తలపడగా.. పాక్ 92, శ్రీలంక 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్ టై అయ్యింది.
ఈసారి లంకతో అంత ఈజీ కాదు..
ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై స్పష్టమైన ఆథిక్యం కలిగిన పాక్‌కు లంకేయులతో ఈసారి అంత ఈజీ కాదని అనిపిస్తుంది. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన చాలా రెట్లు మెరుగుపడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతి భారీ లక్ష్యన్ని (429) ఛేదిస్తూ కూడా శ్రీలంక అంత ఈజీగా చేతులెత్తేయలేదు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు పరాజయంపాలైనప్పటికీ, బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చారు.
కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు అసమానమైన తెగువను చూపి భారీగా పరుగులు సాధించారు. కుశాల్ మెండిస్ (76), అసలంక (79), కెప్టెన్ షనక (68) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. లంక బ్యాటర్లు మరోసారి మెరుపులు మెరిపిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment