ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఆండర్సన్.. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్‌లో 704 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్.. రెడ్‌బాల్ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా తన కెరీర్‌ను ముగించాడు. ఈ క్రమంలో అండర్సన్స్‌కు క్రికెటర్లు,అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అయితే ఆండర్సన్‌కు అభినందనలు తెలిపే క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పప్పులో కాలు వేశాడు. ఆండర్సన్ ‘కట్టర్’లను ఎదుర్కోవడం విశేషం అని బాబర్ తెలిపాడు.
"జిమ్మీ.. మీ బౌలింగ్‌లో కట్టర్‌లను ఎదుర్కోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు జెంటిల్‌మన్ గేమ్ నీలాంటి గొప్ప క్రికెటర్‌ను కచ్చితంగా మిస్ అవుతోంది. వరల్డ్ క్రికెట్‌లో మీ గొప్పతనం గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది.
నిజంగా మీరు గోట్(గ్రేటేస్ట్ ఆల్‌టైమ్)" అని ఎక్స్‌లో బాబర్ రాసుకొచ్చాడు. అయితే ఇక్కడే బాబర్ తప్పు చేశాడు. అస్సలు కట్టర్స్ అనేవి ఆండర్సన్ బౌలింగ్ శైలికి సంబంధం లేదు. అతడు ఎక్కువగా బంతిని స్వింగ్ చేస్తాడు. దీంతో బాబర్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు.
అయితే తన తప్పును గ్రహించిన బాబర్ పోస్ట్‌ను డిలీట్ చేసి కొత్తగా మళ్లీ పోస్ట్ చేశాడు. ఈ సారి మీ స్వింగ్‌ను ఎదుర్కొవడం విశేషం అంటూ రాసుకొచ్చాడు. బాబర్ తొలుత పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటకి నెటిజన్లు మాత్రం స్క్రీన్ షాట్‌లు తీసి పాక్ కెప్టెన్‌ను తెగ ఆడేసికుంటున్నారు. ఇనాళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నావు.. నీవు మారవా బాబర్ అంటే కామెంట్లు చేస్తున్నారు.
It was a privilege to face your swing, Jimmy!
The beautiful game will now miss one of its greatest. Your incredible service to the sport has been nothing short of remarkable. Huge respect for you, GOAT 🫡 pic.twitter.com/fE2NMz4Iey— Babar Azam (@babarazam258) July 12, 2024
Comments
Please login to add a commentAdd a comment