పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్ల నూతన కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహిసిన్ నఖ్వి అధికారికంగా ప్రకటించాడు. కొద్ది రోజుల కిందట పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ వైదొలిగిన విషయం తెలిసిందే.
రానున్న ఆస్ట్రేలియా, జింబాబ్వే టూర్‌లతో రిజ్వాన్ కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఇవాళ ఉదయం ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం పాకిస్తాన్ జట్లను ప్రకటించారు. జట్లను ప్రకటించే సమయంలో కెప్టెన్ పేరును వెల్లడించలేదు. తాజాగా పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వి రిజ్వాన్ పేరును ప్రకటించాడు. రిజ్వాన్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా వ్యవహరిస్తాడని నఖ్వీ తెలిపాడు.
పాక్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం జట్లను ఎంపిక చేయడంతో తమ పాటు తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించింది. పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కొత్తగా ఐదుగురికి అవకాశం లభించింది. బాబర్ ఆజమ్‌కు అనుకూలంగా బోర్డుకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన ఫఖర్ జమాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు.
సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా..
కేటగిరీ-ఏ: బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్
కేటగిరీ-బి: నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్
కేటగిరీ-సి: అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్
కేటగిరీ-డి: అమీర్ జమాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మొహమ్మద్ అలీ, మహ్మద్ హుర్రైరా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ ఖాన్
ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం పాక్ జట్లు..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..
అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిది
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..
అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు పాక్ జట్టు..
అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షానవాజ్ దహానీ, తయ్యబ్ తాహిర్
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు..
అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా, సుఫ్యాన్ మొఖిమ్, ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment