
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జవేరియా ఖాన్ 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల జవేరియా ఖాన్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇవాళ (మార్చి 21) ప్రకటించింది. జవేరియా 2008-2023 మధ్యలో 116 వన్డేలు, 112 టీ20లు ఆడింది. ఈమె వన్డేల్లో 2 శతకాలు, 15 అర్దశతకాల సాయంతో 2885 పరుగులు.. టీ20ల్లో 10 అర్దశతకాల సాయంతో 2018 పరుగులు చేసింది.
రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన జవేరియా.. వన్డేల్లో 17, టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టింది. తన కెరీర్‌లో ఫీల్డర్‌గానూ చురుకైన పాత్ర పోషించిన జవేరియా వన్డేల్లో 34 క్యాచ్‌లు, 13 రనౌట్లు.. టీ20ల్లో 16 క్యాచ్‌లు, 10 రనౌట్‌లు చేసింది. 17 వన్డేలు, 16 టీ20ల్లో పాక్ జాతీయ జట్టుకు సారధ్యం వహించిన జవేరియా .. ప్రస్తుత పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్‌కు డిప్యూటీగానూ (వైస్ కెప్టెన్) వ్యవహరించింది.