margam
-
బాబార్ రోడ్డును అయోధ్య మార్గ్‌గా మార్చాలంటూ..
దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ సేన కార్యకర్తలు బాబర్ రోడ్డు పేరును అయోధ్య రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు బాబర్ రోడ్డు అని ఉన్న సూచిక బోర్డుపై అయోధ్యమార్గ్ అనే పేరు అతికించారు. ఈ సందర్భంగా హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ ‘బాబర్ రోడ్డు పేరును మార్చాలని హిందూ సేన చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ దేశం భారతదేశం.. ఇది శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, వాల్మీకి, గురు రవిదాస్ తదితర మహానుభావులు నడయాడిన దేశం. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మిస్తున్నారు. బాబర్ నిర్మించిన బాబ్రీ మసీదు ఇక లేనప్పుడు, ఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు వల్ల ఉపయోగం ఏమిటి?’ అని ప్రశ్నించారు. న్యూఢిల్లీలోని బెంగాలీ మార్కెట్లో ఉన్న బాబర్ రోడ్డు పేరు మార్చాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఎన్డీఎంసీ ఛైర్మన్‌కు ఒక లేఖరాశారు. బాబర్ ఒక చొరబాటుదారుడని, హిందువులపై దౌర్జన్యాలను సాగించాడని, అందుకే బాబర్ పేరుతో ఉన్న ఈ రహదారి పేరును అయోధ్య మార్గ్‌గా మార్చాలని ఆ లేఖలో కోరారు. -
వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!
అదిగో అల్లదిగో.. అంటూ శ్రీవారిని స్మరిస్తూ.. వేడుకొంటూ అత్యంతభక్తితో రాజంపేట మండలంలోని తాళ్లపాక వాసి పదకవితాపితామహడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన కాలిబాట అది. ఇది వెయ్యేళ్ల కిందటి మాట. ఆహ్లాదరకమైన దట్టమైన అటవీమార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ రోజుల్లో పూర్వీకులు వేలసంఖ్యలో వెళ్లేవారు. అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచివెళ్లారు. టీటీడీ అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి నడుం బిగించి భక్తులను ఆనందపరవశులను చేస్తోంది. రాజంపేట: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32వేల కీర్తనలను రాసి ఆలపించి, మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా శ్రీవారిభక్తులు భావిస్తున్నారు. ఆ కాలిబాటలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి.. గతంలో అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. అప్పట్లో వైఎస్సార్ స్పందించి టీటీడీకి ఈ కాలిబాటను పరిశీలించాలని ఆదేశాలు కూడా జారీచేశారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి అమోదం తెలిపింది. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో టీటీడీ నిమగ్నమైంది. 18న ఆకేపాటి అన్నమయ్య కాలిబాటలో.. ఈనెల 18న శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి 20వసారి వేలాదిమందితో అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను చేపట్టి ఏడుకొండలకు చేరుకోనున్నారు. ఈయనతో పాటు అనేకమంది గోవిందమాలలు ధరించి అన్నమయ్య కాలిబాటలో వెళ్లనున్నారు. ఉదయం ఆకేపాటి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కాలిబాట స్వరూపం.. ► మామండూరు–బాలపల్లె మధ్య స్వామిపాదాలు నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది. పక్షుల కిలకిలలు, సెలయేళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది. ► అవ్వతాతగుట్టలు, శుక్రవారం బండలు, పురాతన సత్రాలు, ఎర్రిగుంటలు, ఈతకాయల మండపం నుంచి గోగర్భతీర్థం (తిరుమల)చేరుకుంటుంది. ► సుమారు ఈ కాలిబాట 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది. ► పాదాలు, అక్కడి కోనేరు, సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాలిబాటకు వెయ్యేళ్లు... రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య నడిచి వెళ్లిన కాలిబాట నేడు శిథిలమైంది. వెయ్యేళ్ల క్రితం ఉన్న రహదారి అభివృద్ధికి టీటీడీ దృష్టి సారించింది. ఈ బాట ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచి భక్తులు గోవిందనామస్మరణాలు చేసుకుంటూ శ్రీవారిసన్నిధికి చేరుకుంటూనే ఉన్నారు. ఉత్తర, దక్షిణ భారతీయులకు అనుకూలం... పూర్వం తిరుమలకు ఈ దారి గుండా అధికసంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు. అయితే తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు. స్వామి సన్నిధికి చేరుకునే పుణ్యపవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరుగుతోంది. కాలిబాటలో శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం.. పదకవితా పితామహడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచివెళ్లిన కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం మహాభాగ్యం. ఇప్పటికే అనేకమంది భక్తులు గోవిందమాల ధరించి ఆ మార్గంలో కొండకు చేరుకుంటున్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ ముందుకు రావడం శుభపరిణామం. జడ్పీచైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కాలిబాటలో వేలాదిమంది భక్తులతో కొండకు 20వ సారి వెళుతున్నారు. – చొప్పా ఎల్లారెడ్డి, వైస్‌చైర్మన్, ఎఐటీఎస్, రాజంపేట అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి ఆకేపాటి కృషి అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఎంతగానో కృషిచేసారు. దివంగత సీఎం, ప్రస్తుతం సీఎం, టీటీడీ చైర్మన్ దృష్టికి కాలిబాట అంశం అనేకసార్లు తీసుకెళ్లారు. ఫలితంగా ఇప్పుడు అన్నమయ్య కాలిబాట అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేసింది. అన్నమయ్య కాలిబాటలో వెళ్లే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ కూడా వైద్య సేవలందించేందుకు అందుబాటులో ఉంటారు. – పిల్లిపిచ్చయ్య, అధ్యక్షుడు, రాజంపేట తాలుకా పెన్షనర్ల సంఘం -
తప్పకుండా నచ్చుతుంది
స్వదేశానికి వచ్చిన యువకుడు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడన్న కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘జయం కొండాన్’. వినయ్, భావన జంటగా నటించిన ఈ చిత్రాన్ని సత్యదేవా పిక్చర్స్ పతాకంపై ఆర్. సత్యనారాయణ ‘మార్గం’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘వాణిజ్య హంగులు ఉన్న సినిమా ఇది. దర్శకుడు ఆర్. కన్నన్ అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, కెమెరా: బాల సుబ్రమణ్యం. -
లండన్ నుంచి ఇండియాకు వచ్చి...
వినయ్, భావన, లేఖా వాషింగ్టన్ ముఖ్య తారలుగా రూపొందిన తమిళ చిత్రం ‘జయమ్ కొండాన్’, తెలుగులోకి ‘మార్గం’ పేరుతో అనువాదమైంది. సత్యదేవా పిక్చర్స్ పతాకంపై ఆర్. సత్యనారాయణ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను ఆర్. సత్యనారాయణ చెబుతూ -‘‘ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అనువాద హక్కులు దక్కించుకోవడానికి చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు. చివరకు మాకు దక్కడం ఆనందంగా ఉంది. లండన్‌లో హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువకుడు, ఇండియా వచ్చి అనుకోని సంఘటనలో ఇరుక్కుంటాడు. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు? అనేది ఈ చిత్రం కథాంశం. విద్యాసాగర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయబోతున్నాం. ఆర్. కన్నన్ దర్శకత్వం, వినయ్, భావనల నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. -
మార్గం మూవీ స్టిల్స్
-
విభిన్న మార్గంలో...
అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన ఓ యువకుడు తన కుటుంబంలోని సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు...? అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘మార్గం'. ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద పనిచేసి, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన కణ్ణన్ ఈ చిత్రానికి దర్శకుడు. వినయ్, భావన జంటగా నటించిన ఈ చిత్రాన్ని సత్యదేవా పిక్చర్స్ పతాకంపై ఆర్. సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రేమ, కుటుంబ విలువలు, వినోదం కలగలిసిన చిత్రమిది. కుటుంబ సమస్య పరిష్కారం కోసం ఇందులో హీరో ఎంచుకునే మార్గం వైవిధ్యంగా, విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా పాటలను మార్చి మొదటి వారంలో, సినిమాను మూడో వారంలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, కెమెరా: బాల సుబ్రహ్మణ్యం, పాటలు: శివ గణేష్.