విభిన్న మార్గంలో... | through different way ... | Sakshi
Sakshi News home page

విభిన్న మార్గంలో...

Published Fri, Feb 27 2015 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

విభిన్న మార్గంలో...

విభిన్న మార్గంలో...

అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన ఓ యువకుడు తన కుటుంబంలోని సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు...? అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘మార్గం'. ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద పనిచేసి, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన  కణ్ణన్ ఈ చిత్రానికి దర్శకుడు. వినయ్, భావన జంటగా నటించిన ఈ చిత్రాన్ని సత్యదేవా పిక్చర్స్ పతాకంపై ఆర్. సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రేమ, కుటుంబ విలువలు, వినోదం కలగలిసిన చిత్రమిది. కుటుంబ సమస్య పరిష్కారం కోసం ఇందులో హీరో ఎంచుకునే మార్గం వైవిధ్యంగా, విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా పాటలను మార్చి మొదటి వారంలో, సినిమాను మూడో వారంలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు.  ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, కెమెరా: బాల సుబ్రహ్మణ్యం, పాటలు: శివ గణేష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement