లండన్ నుంచి ఇండియాకు వచ్చి... | Sathyam Vaipu Margamu Movie Stills | Sakshi
Sakshi News home page

లండన్ నుంచి ఇండియాకు వచ్చి...

Published Fri, Mar 6 2015 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

లండన్ నుంచి ఇండియాకు వచ్చి...

లండన్ నుంచి ఇండియాకు వచ్చి...

వినయ్, భావన, లేఖా వాషింగ్టన్ ముఖ్య తారలుగా రూపొందిన తమిళ చిత్రం ‘జయమ్ కొండాన్’, తెలుగులోకి ‘మార్గం’ పేరుతో అనువాదమైంది. సత్యదేవా పిక్చర్స్ పతాకంపై ఆర్. సత్యనారాయణ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను ఆర్. సత్యనారాయణ చెబుతూ -‘‘ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అనువాద హక్కులు దక్కించుకోవడానికి చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు.

చివరకు మాకు దక్కడం ఆనందంగా ఉంది. లండన్‌లో హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువకుడు, ఇండియా వచ్చి అనుకోని సంఘటనలో ఇరుక్కుంటాడు. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు? అనేది ఈ చిత్రం కథాంశం. విద్యాసాగర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయబోతున్నాం. ఆర్. కన్నన్ దర్శకత్వం, వినయ్, భావనల నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement