
‘అందరికీ నమష్కారం.. నా పేరు...’ అంటూ తెలుగు రాని హీరోయిన్లు స్టేజీల మీద ముద్దు ముద్దుగా పలికే మాటలు వింటుంటాం. కొంతమంది తక్కువ సమయంలోనే ‘నమస్కారం’ అనడం నేర్చేసుకుంటారు. ఏకంగా తమ పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటారు. ఆ లిస్టులో ఇటీవల కీర్తీ సురేశ్ చేరారు. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్ కూడా. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అజ్ఞాతవాసి’. కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ సినిమా కోసం ఇటీవల కీర్తీ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘తొలిసారిగా నా పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇది ‘అజ్ఞాతవాసి’ సినిమాతో సార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు అను. ఈ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. అనూ చిలక పలుకులు అప్పుడు వినొచ్చన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment