
సాక్షి, హైదరాబాద్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం చాలా చాలా బాగుందని జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆది పేర్కొన్నారు. తమ్ముడు, తొలిప్రేమ సమయంలో పవన్ లో ఉన్న కామెడీ టైమింగ్ మళ్లీ ఈ చిత్రంలో చూడొచ్చని తెలిపారు. ఈ సినిమా గురించి పూర్తిగా చెప్పాలంటే పవన్ కోసం పదిసార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, రావు రమేష్ల కోసమైతే వీలున్నప్పుడల్లా వెళ్లి చూడొచ్చన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాతవాసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సీరియస్గా చాలా చాలా బాగుందని చెప్పారు.
ఈ చిత్రంలో బొమన్ ఇరానీ చెప్పిన 'రాజ్యం మీద ఆశలేనివాడికంటే గొప్ప రాజు ఎవడుంటాడు' అనే డైలాగ్ బాగుందన్నారు. ఇలాంటివి సినిమాలో చాలా డైలాగులుంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment