అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజర్ వచ్చేసింది. పెద్దగా మాటల్లేని టీజర్.. మెలోడియస్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంది. టీజర్‌లో చక్కని లుక్స్‌తో కనిపించిన పవన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. మధురా.. అని ప్రారంభమయ్యే పాట టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో పవన్.. ‘ఓ మై గాడ్’ అనే ఒక్కమాట మాత్రమే టీజర్‌లో ఉంది.