
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాత వాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ‍్గట్టుగా చిత్రయూనిట్ కూడా అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు రెండు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి.
రిలీజ్ కూడా నెల రోజులే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఈ నెల 19న ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ లోగా ఫ్యాన్స్ కు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు పవన్. డిసెంబర్ 16న టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా టీజర్ ను రూపొందిస్తున్నారట.
పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ హోం బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment