పవన్‌లో నటవిశ్వరూపం చూస్తారు: త్రివిక్రమ్‌ | agnathavasi audio function event in hyderabad | Sakshi
Sakshi News home page

పవన్‌లో నటవిశ్వరూపం చూస్తారు: త్రివిక్రమ్‌

Published Tue, Dec 19 2017 10:08 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

agnathavasi audio function event in hyderabad - Sakshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నేడు (డిసెంబర్ 19) ఘనంగా జరుగింది.  పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను 2018 జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. దీనిని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ బాణీలు అందించారు.

ఈ సినిమాలో 5పాటలు మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటే.. ఇందులో పవర్‌స్టార్‌ కూడా ఒక పాట పాడారు. అది కొత్త సంవత్సరం కానుకగా అభిమానులకు డిసెంబర్‌ 31న రిలీజ్‌ చేయనున్నారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌ మొత్తాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. పవన్‌తో కథ గురించి కేవలం రెండు నిమిషాలే చెప్పానన్నారు, ఈ సినిమాలో పవన్‌లో ‘నటవిస్వరూపం’  చూస్తారని చెప్పారు. 

పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. అభిమానించే ప్రతి ఒక్కరినే గుండెల్లో పెట్టుకోవాలని ఉందని, సినిమాల ద్వారా మీ అందరికి చేరువైనందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఖుషి తరువాత చేసిన ఐదు సినిమాల తరువాత సినిమాలకి దురమవుదామనుకున్నానని చెప్పారు. కానీ అభిమానుల ప్రేమే నన్ను సినిమాల్లో ఉంచిందన్నారు. నేను ఎపుడూ ఓటమికి భయపడలేదని, గెలుపుకి పొంగిపోలేదని అన్నారు. నేను కష్టాల్లో ఉన్నపుడు నా వెన్నుతట్టి గుండెల్లో ధైర్యాన్ని నింపిన వ్యక్తి  త్రివిక్రమ్‌ అని పొగిడారు. నా గుండె ఎప్పుడూ మీకోసం కొట్టుకుంటుందని, మీ ప్రేమాభిమానాలు నాకు ఎల్లపుడూ.. ఉండాలని కోరుకుంటూ జైహింద్‌ అని ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement