
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తాజా సినిమా 'అజ్ఞాతవాసి' డిసెంబర్ 30న సెన్సార్ పూర్తి చేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న విడుదల కానుంది. త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి హిట్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రిలీజైన పాటలు హిట్ అయ్యాయి. ఇందులో పవన్ అజ్ఞాతంలో ఉండే ధనవంతుడి పాత్రను పోషిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కీర్తి సురేశ్, అను ఇమాన్యుయేల్ పవన్‌కు జోడిగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి, కుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేశ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే పవన్ పాడిన ‘కొడుక కోటీశ్వర రావు’ పాట ట్రైలర్ వైరల్‌గా మారింది.