గుంటూరు కారం రిలీజ్‌.. ట్రెండింగ్‌లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే? | Mahesh Babu's Guntur Kaaram Release Trending With Agnathavasi | Sakshi
Sakshi News home page

గుంటూరు కారం రిలీజ్‌.. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?

Published Fri, Jan 12 2024 3:25 PM | Last Updated on Fri, Jan 12 2024 3:43 PM

Mahesh Babu Guntur Kaaram Released today Trending With Agnathavasi - Sakshi

మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మరో చిత్రం గుంటూరు కారం. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజైంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సినీ ప్రియుల నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కొందరు అభిమానులు బ్లాక్ బస్టర్‌ హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో గుంటూరు కారం అంత ఘాటు.. సినిమాలో కనిపించలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అభిమానుల నుంచి మహేశ్‌ బాబు గుంటూరు కారం సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఒకవైపు గుంటూరు కారం థియేటర్లలో అలరిస్తుండగా.. మరోవైపు పవన్‌ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. గుంటూరు కారం సినిమాను అజ్ఞాతవాసి చిత్రంతో పోలుస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇవాళ విడుదలైన గుంటూరు కారం చూస్తే.. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి గుర్తుకు వస్తోందని కొందరు ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆరేళ్ల క్రితం రిలీజైన పవన్ సినిమా క్రియేట్ చేసిన ఓవర్‌సీస్‌ కలెక్షన్స్‌ రికార్డును గుంటూరు కారం క్రాస్ చేయలేదని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ రెండు చిత్రాలను త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కినవే కావడం మరో విశేషం. మరీ సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం మూవీతో మరో చిత్రం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. పొంగల్ పోటీని తట్టుకుని ఎవరు సక్సెస్ సాధిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement