
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్‌పై రామ్‌గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. తన ట్విట్టర్‌లో ‘ నేను పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిని. అయితే, ఒక్క క్షణం ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. పీఎస్‌పీకే 25 ఫస్ట్ లుక్ కంటే ఒక్క క్షణం ఫస్ట్ లుక్ మిలియన్స్ టైమ్స్ బెట్టర్ అని‘ వర్మ ట్విట్ చేశారు. ఈ సారి అల్లు శిరీస్ పవన్ కళ్యాణ్పై పైచేయి సాధించాడని కూడా ఆ ట్విట్‌లో పేర్కొన్నారు వర్మ. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక్క క్షణం చిత్రంలో హీరో అల్లు శిరీష్, హీరోయిన్ సురభిలు నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలిసారిగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ మాస్ పాటను ఆలపించారన్న ప్రచారం జరుగుతోంది.