
కవలలకు జన్మనిచ్చిన ఉదయభాను
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కవల పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ఓ బాబు, పాపకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉదయభాను కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.