కోరిక తీర్చకుంటే మార్ఫింగ్‌ ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు | Hydearabd Man Threatning Tv Anchor With Morphod Photos | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చకుంటే మార్ఫింగ్‌ ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు

Published Thu, Dec 8 2022 8:33 PM | Last Updated on Fri, Dec 9 2022 5:04 AM

Hydearabd Man Threatning Tv Anchor With Morphod Photos - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోరిక తీర్చకుంటే మార్ఫింగ్‌ చేసిన అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల మేరకు.. మధురానగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న 27 ఏళ్ల యువతి ఓ టీవీ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తుంది. కళాశాలలో ఆమెతో కలిసి చదువుకున్న క్లాస్‌మేట్‌ కూకట్‌పల్లి నివాసి కె.సామ్రాట్‌ ఆమెను వేధిస్తున్నాడు. ప్రేమించాలని వెంట పడటంతో అందుకు నిరాకరించగా స్నేహితుల్లా ఉందామని నమ్మించాడు.

ఓసారి తన కారులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించగా తిరిగి హాస్టల్‌ వద్ద విడిచివెళ్లాడు. యువతిపై కోపం పెంచుకున్న సామ్రాట్‌ ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడు. కోరిక తీర్చకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement