Man Gets 10 Years Jail For Sexually Assaulting An Anchor In Erode - Sakshi
Sakshi News home page

ప్రేమపేరుతో టీవీ యాంకర్‌కు దగ్గర.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, హోటల్‌కు తీసుకెళ్లి..

Published Wed, Dec 7 2022 2:27 PM | Last Updated on Wed, Dec 7 2022 3:31 PM

Man Molestation on TV Anchor at Tiruvottiyur Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై: ఓ టీవీ యాంకర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడికి పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ ఈరోడ్‌ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు.. ఈరోడ్‌కు చెందిన 26 ఏళ్ల యువతి లోకల్‌ టీవీలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఈరోడ్‌ ముత్తంపాలయానికి చెందిన రాహుల్‌ (29)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది.

2018 కోవైలో ఓ ప్రోగ్రాంకి వెళ్లిన సమయంలో హోటల్‌కు తీసుకెళ్లిన రాహుల్‌ తనను వివాహం చేసుకుంటానని చెప్పి బలాత్కారం చేశాడని, అలాగే తన వద్ద 750 గ్రాముల సవర్ల బంగారు నగలు మోసం చేశాడని ఆరోపించింది. ఈ మేరకు ఆగస్టులో ఈరోడ్‌ మహిళాపోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో రాహుల్‌ మోసానికి పాల్పడినట్లు తేలడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు ఇచ్చారు. 

చదవండి: (పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు.. పిల్లలకు విషమిచ్చి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement