యాంకర్ శాంతి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని, నివేదిక ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. విశ్వశాంతి స్వస్థలం విశాఖ జిల్లా అని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment