చక్రి కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు
టాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన సంగీత దర్శకుడు చక్రి చనిపోయి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ ఆయన కుటుంబం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా చక్రి తల్లి విద్యావతి, ఆయన సోదరుడు దీక్షకు దిగిటం మరోసారి సంచలనంగా మారింది. కొంత కాలంగా తమ సోమాజిగూడ లోని వరుణ్ సర్గం విల్లా ఫ్లాట్లో రెంట్కు ఉంటున్నమాధవి అనే మహిళ ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ వారు దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ పై ఉన్న లోన్ డబ్బులు కూడా తామే కడుతున్నట్టుగా చెపుతున్న చక్రి సోదరుడు, మాధవి 8 నెలలుగా అద్దె ఇవ్వటం లేదన్నారు.