సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తయారైన అగ్గిపెట్టెలో ఇమిడే చీర అంతర్జాతీయ వేదికపై మెరిసింది. సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడి, కట్టుకోవడానికి వీలుగా ఉండే పట్టుచీరను నేశారు. ఆ చీరను ఆ్రస్టేలియాలో ఉండే ఎన్‌ఆర్‌ఐ రాధిక కొనుగోలు చేసి ఆ్రస్టేలియా–ఇండియా బిజినెస్ కౌన్సిల్‌లో ప్రదర్శించారు.
పట్టుదారం పోగులతో 100 గ్రాముల బరువు, 5.500 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను విజయ్‌కుమార్ మరమగ్గం (పవర్‌లూమ్)పై నేశాడు. ఆ చీరను రాధిక ప్రదర్శించి సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తీసుకొచ్చారు.
చదవండి: మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం!
Comments
Please login to add a commentAdd a comment