pattu saree
-
పట్టుచీరలో బుట్టబొమ్మలా మాళవిక మోహనన్ (ఫొటోలు)
-
పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!
శుభకార్యం ఏదైనా వధూవరులు, మహిళలు, పురుషులు, పిల్లలు అని తేడా లేకుండా అందరూ పట్టు వస్త్రాలను ధరించడం సాంప్రదాయంగా భావిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనం, అందం ఉట్టిపడుతుంది. దీంతో మార్కెట్లో పట్టు వస్త్రాలకు మంచి ధర, డిమాండ్ ఉంది. వస్త్ర దుకాణాల్లో లైట్ల వెలుగులో పట్టు వస్త్రాలు దగదగా మెరుస్తుంటాయి. కానీ, అందులో ఏది అసలు, ఏది నకిలీ పట్టు వస్త్రమనేది వినియోగదారులు కనిపెట్టడం చాలా కష్టం. వస్త్ర దుకాణాదారులు కూడా వినియోగదారుడిని బురిడీ కొట్టించే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్వచ్చమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్, మగ్గంపై నేసిన వస్త్రాలకైతే హ్యాండ్లూమ్ మార్క్‌ను అందజేస్తుంది. సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ లేబుల్ ఉన్నట్లయితే అది స్వచ్చమైనదిగా గుర్తించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న వస్త్ర వ్యాపారులకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి లోగోలను అందజేస్తారు. పట్టులో పలు రకాలు.. పట్టులో అనేక రకాలున్నాయి. అందులో సహజసిద్ధమైన మల్బరీ సిల్క్‌ను ‘క్వీన్ ఆఫ్ టెక్స్టైల్’గా పిలుస్తారు. ఇది మల్బరీ పట్టు పురుగైన బాంబేక్స్ మోరె నుంచి తయారవుతుంది. ఇది చాలా ఖరీదైనది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని 90 శాతం వినియోగిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలన్నీ మల్బరీ పట్టుతోనే తయారవుతున్నాయి. ‘టస్సార్ సిల్క్’ కాపర్రంగులో ఉంటుంది. అడవుల్లో ఉండే పట్టు పురుగుల నుంచి తయారు చేస్తారు. టస్సార్ పట్టును ఎక్కువగా హోం ఫర్నీషింగ్, ఇంటీరియర్ డెకరేషన్లో వినియోగిస్తారు. ఇందీ పట్టు పరుగుల నుంచి ‘ఈరీ సిల్క్’ తయారవుతుంది. ఈరీ పట్టును కాటన్, ఉన్ని, జనపనారతో కలిపి ఫ్యాషన్, ఇతర అస్సెస్సరీస్, హోం ఫర్నీషింగ్ తయారు చేస్తారు. ‘ముంగా పట్టు’ బంగారు వర్ణంలో ఉంటుంది. దీనిని తయారు చేసే పట్టు పురుగులు అడవుల్లో ఉంటూ సోమ్ అండ్ సోఆలు అనే చెట్ల ఆకులను తింటాయి. అసలైన పట్టును ఇలా గుర్తించవచ్చు.. పట్టు పోగుని వెలిగించినప్పుడు నిరంతరంగా కాలకుండా ఆరిపోతుంది. పట్టు కాలినప్పుడు వెంట్రుకలు, ఈకలు కాలిన వాసన వస్తుంది. పోగు కొనలో చిన్న నల్లపూసలా మారుతుంది. పూసను నలిపినప్పుడు పొడి అయ్యి పోగు గరుకుగా మారుతుంది. పట్టు వస్త్రాలను ఎల్లప్పుడు సిల్క్‌మార్క్ అధీకృత షాపుల్లోనే కొనాలి. పట్టు వస్త్రాలకు ఉన్న సిల్క్‌మార్క్ లేబుల్ 100 శాతం పట్టు ప్రామాణికతను సూచిస్తుంది. పట్టు వస్త్రాలని సిల్క్‌మార్క్ వారిచే ఉచితంగా పరీక్షింప జేసుకోవచ్చు. స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్ ఉంటుంది. మగ్గంపై నేసిన పట్టుకు హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా?
వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందం ఆమె. వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకున్న బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మాధురీ దీక్షిత్ లివింగ్ లెజెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంప్రదాయ దుస్తులలో, ముఖ్యంగా చీరలలో మెరిసిపోతూ ఉంటుంది ఈ ఎవర్గ్రీన్ దివా. పాప్ ఆఫ్ పింక్, ఏ డ్యాష్ ఆఫ్ గ్రేస్ అంటూ తన అందాన్ని పొగడకుండానే తెగ పొగిడేసుకుంది. తన బ్యూటిఫుల్ స్మైల్‌తో పాటు, చక్కటి డ్యాన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఆమె అందమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మాధు దీక్షిత్ గుజరాత్ బంధాని (బంధేజీ) పట్టుచీరలో మెరిసిపోతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్రైట్ కలర్ ఆరు గజాల చీరలో మాధురి లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. పింక్, పర్పుల్ కాంబినేషన్లో బంగారు రంగు అంచు చీరలో అద్భుతంగా కనిపించింది. పర్పుల్ హ్యూడ్ బ్లౌజ్, చక్కటి మేకప్, సాధారణ హెయిర్ బన్, యాంటిక్ జ్యూయల్లరీతో మరింత ఫ్యాషన్‌ను జోడించింది. దీంతో ఈ చీర ఎంత అనే ఆసక్తి నెలకొంది. గ్రాండ్ పీస్ ధర 75వేల రూపాయలట. కాగా జవనరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి భర్త శ్రీరామ్ తో కలిసి హజరైంది. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
అంతర్జాతీయ వేదికపై మెరిసిన అగ్గిపెట్టె చీర
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తయారైన అగ్గిపెట్టెలో ఇమిడే చీర అంతర్జాతీయ వేదికపై మెరిసింది. సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడి, కట్టుకోవడానికి వీలుగా ఉండే పట్టుచీరను నేశారు. ఆ చీరను ఆ్రస్టేలియాలో ఉండే ఎన్ఆర్ఐ రాధిక కొనుగోలు చేసి ఆ్రస్టేలియా–ఇండియా బిజినెస్ కౌన్సిల్లో ప్రదర్శించారు. పట్టుదారం పోగులతో 100 గ్రాముల బరువు, 5.500 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను విజయ్‌కుమార్ మరమగ్గం (పవర్లూమ్)పై నేశాడు. ఆ చీరను రాధిక ప్రదర్శించి సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తీసుకొచ్చారు. చదవండి: మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం! -
రెండు చీరల కట్టు.. ఆధునికంగా ఆ‘కట్టు’
ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వచ్చినా చీరకట్టుకే మన అమ్మాయిలు ఓటేస్తున్నారు. సంప్రదాయ వేడుకకు, ఇండోవ్రెస్టన్ స్టైల్ పార్టీలకు చీరతోనే సింగారించుకుంటున్నారు. అందుకే, చీరకట్టులోనూ ఎన్నో వినూత్నమార్పులు వచ్చాయి. రెడీమేడ్‌గా వేసుకునే ధోతీ శారీ, ప్యాంట్, పలాజో వంటి శారీస్‌తో పాటు రెండు చీరలతోనూ వినూత్న స్టైల్ తీసుకువస్తున్నారు. పండగలకు, వివాహ వేడుకలకు ఓస్టైల్, వెస్ట్రన్ పార్టీలకూ మరో స్టైల్‌తో ఇలా చీరకట్టులో మెరిసిపోతున్నారు. పెప్లమ్ శారీ కలంకారీ పెప్లమ్ బ్లౌజ్‌తో ప్లెయిన్ శారీ కట్టుకు ఆధునికత జతగా చేరింది. ఏ విధమైన ఇతరత్రా హంగులు లేకుండా చూడగానే వావ్ అనిపించే కళ నేటి కాలపు అమ్మాయిల ఛాయిస్‌గా మారింది. శారీ విత్ దుపట్టా స్టైల్ కంచిపట్టు చీరతో పాటు కంచిపట్టు దుపట్టా కూడా ఎంచుకొని వేడుకలకు ఇలా రెడీ అవ్వచ్చు. రెండు విభిన్నరంగుల కాంబినేషన్‌తో ఈ స్టైల్ తీసుకురావచ్చు. ఎడమ, కుడి భుజాల మీదుగా తీసిన కొంగులు మూలంగా యువరాణీ కళ కనువిందుచేస్తుంది. ప్యాంట్ శారీ ఒకే కలర్, ప్రింట్ కాంబినేషన్లో ప్యాంట్‌కు జత చేసిన పవిట కొంగుతో ఈ డ్రెస్ నవతరం అమ్మాయిలను ఆకర్షిస్తుంది. ఏవిధమైన హంగులు లేకుండా ధరించడానికి సులువుగా ఉండే స్టైల్ ఇది. ఇది ధోతీ శారీకి దగ్గరగా ఉన్నా ప్యాంట్ కావడంతో స్టైల్ భిన్నంగా ఉంటుంది. కాటన్, సిల్క్ ఇతర ప్యాటర్న్లలోనూ ఇవి రెడీమేడ్‌గా లభిస్తున్నాయి. రెండు చీరల కట్టు పూర్తి కాంట్రాస్ట్ చందేరీ చీరలను ఎంచుకొని ఒక రంగు చీరను ఒకవైపుకు లెహంగా కుచ్చిళ్లు సెట్ చేసుకొని, మరోవైపు మరో చీరతో కుచ్చిళ్లు తీసి, భుజం మీదుగా పవిట కొంగు తీయాలి. దీనిని బ్యాలెన్స్ చేసుకోలేం అనుకునేవారు బెల్ట్ లేదా వడ్డాణంతో నడుము దగ్గర సెట్ చేసుకోవచ్చు. బ్లౌజ్‌ను బట్టి, ఈ శారీ అలంకరణ ఆధునికంగానూ, సంప్రదాయంగానూ మార్చుకోవచ్చు. ధోతీ శారీ పండగలకు, పుట్టిన రోజు వేడుకలకు సింపుల్‌గా, గ్రేస్‌గా కనిపించాలంటే ఈ స్టైల్ సరిగ్గా నప్పుతుంది. ధరించడమూ సులువు. పవిట కొంగు ధోతీకి జత చేసి రావడంతో ఇది ధోతీ శారీ డ్రెస్‌గానూ మార్కులు కొట్టేసింది. లంగా ఓణీ స్టైల్లో చీర కట్టు రెండు భిన్నమైన రంగులు తీసుకొని ఒకవైపు ఒక చీర పచ్చ, రెండవ వైపు గులాబీ రంగు చీర కుచ్చిళ్లను సెట్ చేస్తూ లంగాఓణీ మోడల్ వచ్చేలా కట్టుకోవడం. ఈ కట్టు సంప్రదాయ వేడుకలకు సరైన ఎంపిక అవుతుంది. -
వరుస పండగలు.. వింటేజ్ వేడుక
ఆషాఢమాసం... బోనాలు శ్రావణం... వరలక్ష్మీ వ్రతాలు వరుస పండగలు, వేడుకలు మనల్ని పలకరించబోతున్నాయి. ఇన్ని రోజులూ మహమ్మారి కారణంగా సందడికి దూరంగా ఉన్నా ఇక ముందు వేడుకలు కొత్తగా ముస్తాబు కానున్నాయి. యాభై ఏళ్ల కిందటి వింటేజ్ కళతో ఇప్పుడిక మెరిసిపోనున్నాయి. కొన్ని చీరకట్టులను చూస్తే ప్రసిద్ధ వ్యక్తుల పరిచయం అక్కర్లేకుండా కళ్ల ముందు మెదలుతారు. అలాంటి వారిలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బాలీవుడ్ నటి రేఖ వంటి వారుంటారు. పెద్ద అంచు కంచి పట్టు చీరలైనా, రంగుల హంగులైనా, ఆభరణాల జిలుగులైనా, కేశాలంకరణ అయినా.. ఎటు కదిలినా ఆ అందం వారి ప్రత్యేకతను కళ్లకు కడుతుంది. ప్రసిద్ధ వ్యక్తులను తలపించేలా నేటి తరం అమ్మాయిల ఆహార్యం ఉంటే ఒక వింటేజ్ అట్రాక్షన్‌తో ఇట్టే ఆకట్టుకుంటారు. ఎప్పటికీ ఉండిపోవాలనే.. అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి.. ఇలా తరతరాలకు ఈ గొప్పతనం అందాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికీ ఆ కళ నిలిచిపోయే విధంగా డిజైన్ చేసిన చీరలు ఇవి. ప్యూర్ పట్టుతో మగ్గం మీద నేసిన చీరలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా కంచిపట్టు అనగానే అందరికీ తెలిసిన రంగులు ఎరుపు, పసుపు, గోల్డ్ టిష్యూ. కానీ, చాలా అరుదైన రంగుల చీరలను ఎంచుకొని యాభై ఏళ్ల కిందటి లుక్ వచ్చేలా చేనేతకారులతో డిజైన్ చేసిన చీరలు ఇవి. నటి రేఖను తలచుకోగానే ఆమె కంజీవరం చీరలో గ్రాండ్‌గా కనిపిస్తారు. దక్షిణభారత అందాన్ని ప్రపంచ ప్రసిద్ధి చేశారు. ఈ థీమ్‌ని బేస్‌గా చేసుకొని రంగులను ఎంపిక చేసి, ప్రత్యేకంగా రూపొందించిన చీరలు ఇవి. నిన్నటి తరం నుంచి నేడు, అలాగే రేపటి తరానికి కూడా ఈ కళను తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన కలెక్షన్ ఇది. – భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ -
పట్టు చీర చిక్కేదెలా ?
కాళేశ్వరం భూపాలపల్లి జిల్లా : స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర«శేఖర్‌రావు దంపతులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరాలయంలోని శుభానందదేవి(పార్వతీ) అమ్మవారికి సమర్పించిన పట్టుచీర మాయమైన ఘటనపై విచారణ నత్తనడకన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016, మే 2న సీఎం కేసీఆర్, శోభ దంపతులు కాళేశ్వరాలయంలో శుభానందదేవి అమ్మవారికి రూ.36 లక్షలతో బంగారు కిరీటం బహూకరించి, పట్టు చీరను సమర్పించి మొక్కులు చెల్లించిన విషయం తెలిసిందే. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే రోజున భూమిపూజ చేశారు. అయితే ఆ చీర కొన్నాళ్లుగా కనిపించడం లేదు. విషయం బయటకి పొక్కడంతో సిబ్బంది చీరను మార్చి మోసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలుగు రోజులైనా.. సీఎం కేసీఆర్ అమ్మవారికి సమర్పించిన చీర మా యమైన విషయం నాలుగు రోజుల క్రితం వెలుగు చూసినా అధికారుల్లో చలనం రావడం లేదు. కేవలం ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి కూడా తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదే లేదు.. చీర మాయం విషయమై సంబంధిత ఈఓ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పోలీ సులు మాత్రం ప్రాథమికంగా విచారణ జరిపారు. సంబంధిత ఈఓ చీర మాయంపై ఫిర్యాదు చేస్తే విచారణలో వేగం పెంచి చీర చిక్కును ఛేదిస్తామని సీఐ రంజిత్ పేర్కొంటున్నారు. అర్చకుడికి మెమో జారీ.. పట్టు చీర మాయంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేశారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. చీరమార్చి మోసం! సీఎం సమర్పించిన చీర మాయమైందని బయటకి పొక్కడంతో మరో ఇద్దరు అర్చకులు, ఓ ఉద్యోగి కలసి మరో చీరను వరంగల్ బట్టల దుకాణంలో కొనుగోలు చేసి ఆలయ చైర్మన్, ఈఓల ముందు ఉంచారు. ఆ చీర సీఎం సమర్పించిన చీర కాదని మరో వర్గం ఆరోపించడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో ఈవ్యవహరమంతా బట్టబయలైంది. భద్రతపై అనుమానాలు... ఆలయంలో సీఎం ఇచ్చిన చీరకు భద్రత లేనప్పుడు బంగారు నగలు, వెండి ఆభరణాలకు ఎలాంటి భద్రత ఉందో అర్థమవుతుంది. ప్రతే ఏటా కాళేశ్వరాలయంలో వీవీఐపీలు విలువైన పట్టు చీరలు అమ్మవారికి బహూకరిస్తారు. ఆ చీరలు కూడా ఆలయంలో కనిపించడం లేదని తెలుస్తోంది. వాటికి సంబంధించిన రికార్డులను కూడా అధికారులు రాయడం లేదు. ఆ విలువైన చీరలు అధికారుల ఇళ్లకు తరలిపోతున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం సీసీ కెమెరాలు కూడా నాణ్యత లేవని అర్థమవుతోంది. 2 మెగా పిక్సల్ కెమెరాలను ఆలయంలో అమర్చినట్లు తెలిసింది. నాకు అధికారికంగా ఆదేశాలు రాలేదు... కాళేశ్వరాలయంలో చీరం మాయంపై విచారణాధికారిగా నన్ను నియమించలేదు. కలెక్టర్ మౌఖికంగా చెప్పారు. అధికారికరంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆదేశాలు ఇస్తే విచారణ ప్రారంభిస్తా. – మోహన్‌లాల్, డీఆర్ఓ, భూపాలపల్లి చీర మాయంపై ఫైలు అందింది.. కాళేశ్వరాలయంలో సీఎం అందజేసిన చీర మాయంపై సంబంధించిన ఫైలు పరిశీలిస్తున్నాం. త్వరలో చర్యలు తీసుకుంటాం. – కృష్ణవేణి, ఎండోమెంట్, విజిలెన్స్ అధికారి -
రూ.1.38 లక్షల పట్టుచీర కొన్న సీఎం
సాక్షి, బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. రూ.1.38 లక్షల విలువైన పట్టు చీరను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. మంగళవారం దావణగెరెలోని మహానగర పాలికె పరిధిలో నూతనంగా నిర్మించిన వ్యాపార భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మైసూరు పట్టు చీరల వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ ప్రదర్శించిన పట్టు చీరలను పరిశీలిస్తూ అద్భుతంగా ఓ చీర కన్పించడంతో దాన్ని కొనుగోలు చేశారు. కొద్ది రోజుల క్రితం బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేశ్ చెంప చెళ్లుమనిపించి సిద్ధరామయ్య పతాక శీర్షికలకు ఎక్కారు. ఇప్పుడు విలువైన చీర కొని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.