ఆషాఢమాసం... బోనాలు శ్రావణం... వరలక్ష్మీ వ్రతాలు వరుస పండగలు, వేడుకలు మనల్ని పలకరించబోతున్నాయి. ఇన్ని రోజులూ మహమ్మారి కారణంగా సందడికి దూరంగా ఉన్నా ఇక ముందు వేడుకలు కొత్తగా ముస్తాబు కానున్నాయి. యాభై ఏళ్ల కిందటి వింటేజ్ కళతో ఇప్పుడిక మెరిసిపోనున్నాయి.
కొన్ని చీరకట్టులను చూస్తే ప్రసిద్ధ వ్యక్తుల పరిచయం అక్కర్లేకుండా కళ్ల ముందు మెదలుతారు. అలాంటి వారిలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బాలీవుడ్ నటి రేఖ వంటి వారుంటారు. పెద్ద అంచు కంచి పట్టు చీరలైనా, రంగుల హంగులైనా, ఆభరణాల జిలుగులైనా, కేశాలంకరణ అయినా.. ఎటు కదిలినా ఆ అందం వారి ప్రత్యేకతను కళ్లకు కడుతుంది. ప్రసిద్ధ వ్యక్తులను తలపించేలా నేటి తరం అమ్మాయిల ఆహార్యం ఉంటే ఒక వింటేజ్ అట్రాక్షన్‌తో ఇట్టే ఆకట్టుకుంటారు.
ఎప్పటికీ ఉండిపోవాలనే..
అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి.. ఇలా తరతరాలకు ఈ గొప్పతనం అందాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికీ ఆ కళ నిలిచిపోయే విధంగా డిజైన్ చేసిన చీరలు ఇవి. ప్యూర్ పట్టుతో మగ్గం మీద నేసిన చీరలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా కంచిపట్టు అనగానే అందరికీ తెలిసిన రంగులు ఎరుపు, పసుపు, గోల్డ్ టిష్యూ. కానీ, చాలా అరుదైన రంగుల చీరలను ఎంచుకొని యాభై ఏళ్ల కిందటి లుక్ వచ్చేలా చేనేతకారులతో డిజైన్ చేసిన చీరలు ఇవి.
నటి రేఖను తలచుకోగానే ఆమె కంజీవరం చీరలో గ్రాండ్‌గా కనిపిస్తారు. దక్షిణభారత అందాన్ని ప్రపంచ ప్రసిద్ధి చేశారు. ఈ థీమ్‌ని బేస్‌గా చేసుకొని రంగులను ఎంపిక చేసి, ప్రత్యేకంగా రూపొందించిన చీరలు ఇవి. నిన్నటి తరం నుంచి నేడు, అలాగే రేపటి తరానికి కూడా ఈ కళను తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన కలెక్షన్ ఇది.
– భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment