Weaving saree
-
సిరిసిల్ల జరీ.. అగ్గిపెట్టెలో చేరి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను, దబ్బనంలో ఇమిడేలా మరో చీరను నేశాడు. కట్టుకునేందుకు వీలుగా ఉన్న ఈ రెండు చీరలను చేనేత మగ్గంపై బంగారం జరీ పోగులతో నేసి శభాష్ అనిపించుకున్నాడు. గతంలో చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిన పలువురు చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసినా.. అవి కట్టుకునేందుకు అనువుగా ఉండేవి కావు. అగ్గిపెట్టెలో పట్టే చీరతో నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఇప్పుడు హరిప్రసాద్ చేనేత మగ్గంపై గ్రాము బంగారం జరీతో నేసిన చీర కట్టుకునేందుకు అనువుగా ఉంది. మరోవైపు దబ్బనంలో దూరే చీరను సైతం హరిప్రసాద్ నేశాడు. ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించాడు. న్యూజిలాండ్‌కు చెందిన సునీత–విజయభాస్కర్‌రెడ్డి దంపతుల కోరిక మేరకు రూ.10 వేల ఖర్చుతో అగ్గిపెట్టెలో ఇమిడే కట్టుకునే చీరను నేశాడు. దబ్బనంలో ఇమిడే చీర ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 160 గ్రాముల బరువుతో ఉంది. దబ్బనంలో దూరే చీరను సైతం కట్టుకునేందుకు వీలుగా నేశాడు. గ్రాము గోల్డ్ జరీ పట్టు దారాలతో ఈ చీరను నేశాడు. దీని బరువు 350 గ్రాములు ఉంటుంది. ఇప్పటికే సూక్ష్మ కళలో రాణిస్తున్న హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, దబ్బనంలో దూరే చీరను నేసి మరోసారి సిరిసిల్ల నేత కళను ప్రపంచానికి చాటి చెప్పాడు. -
సిరిసిల్ల నేత కళాకారుడి నైపుణ్యం: అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీ
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. చేనేత మగ్గంపై ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీని నేశాడు. తన సాంచాల షెడ్డులో పట్టుపోగులతో రెండున్నర మీటర్ల షర్ట్ బట్ట, రెండు మీటర్ల పొడవైన లుంగీని నేశాడు. తర్వాత రెండున్నర మీటర్ల వస్త్రంతో షర్ట్‌ను కుట్టించాడు. లుంగీ, షర్ట్.. రెండూ అగ్గిపెట్టెలో ఇమిడి పోవడం విశేషం. లుంగీ 140 గ్రాములు, షర్ట్ 100 గ్రాముల బరువు ఉన్నాయి. హరిప్రసాద్ వారం పాటు శ్రమించి వీటిని తయారు చేశాడు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శుక్రవారం వీటిని సిరిసిల్లలో ప్రదర్శించారు. గతంలో కూడా హరిప్రసాద్ సూక్ష్మ మరమగ్గం, మరమగ్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలను నేశాడు. -
అగ్గిపెట్టెలో చే‘నేత’ పట్టుచీర
తెలంగాణ రాష్ట్రంలో చేనేత కులస్తుల దశ మారిపో నుంది. పద్మశాలి (చేనేత) కులస్తుల కోసం, సీఎం కేసీఆర్ వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయ టానికి ముందుకురావడం అభినందనీయం. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమెరికా అధ్య క్షుడు ఒబామాకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను మగ్గం పై నేసి కానుకగా ఇవ్వబోతున్న చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్‌కు ప్రశంసలు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర నేసి గతంలోనే రికార్డు సాధించిన నల్ల పరంధా ములు వంశీయుడీయన. సిరిసిల్ల, సుల్తానాబాద్, వరం గల్, జనగామ, హుజురాబాద్ ప్రాంతాల్లో నివసించే పద్మశాలి (చేనేత) కులస్తుల దయనీయ జీవితాలను మెరుగుపర్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలి. కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి, ఆదిలాబాద్