sravanam
-
సుముహూర్తాల ‘శ్రావణం’!
పామర్రు: గత మూడు నెలలుగా వివాహాలకు ముహూర్తాల్లేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు, యువతీయువకులకు శ్రావణ మాసం ‘శుభ’ఘడియలు తెచి్చంది. ఇప్పటి వరకు ఆషాఢం, శూన్య మాసాల నేపథ్యంలో ముహూర్తాల్లేక వివాహాది కార్యక్రమాలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవడంతో పెళ్లిళ్ల బాజాలు మోగనున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 28 వరకు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో పెళ్లి సందడి మొదలైంది.ఈ శ్రావణ మాసంలో 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీలు వివాహాలకు, గృహ ప్రవేశాలకు మంచి ముహూర్తాలు కాగా, 17, 18 తేదీలు అత్యంత శుభ ముహూర్తాలని పురోహితుడు భేతనభొట్ల ఫణికుమార్‌శర్మ తెలిపారు. దీంతో చాలా రోజుల తర్వాత కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి. చాలా మందికి చేతి నిండా పని దొరకనుంది. పురోహితులు, భజంత్రీలు, పూల అలంకరణలు, ట్రావెల్స్, షామియానాలు, క్యాటరింగ్, బ్యూటీíÙయన్లు, డీజేలతో పాటు కూలీలకు మంచి డిమాండ్ పలకనుంది. -
Sravana Masam: శ్రావణం శుభకరం.. ముఖ్యమైన తేదీలివే!
అనంతపురం కల్చరల్: ఈనెల 28న వచ్చే అమావాస్య రాకతో ఆషాఢమాసం ముగిసి శుక్రవారం నుంచి నోములు, వ్రతాలకు నెలవైన శ్రావణం మాసం రానుంది. శుభకార్యాలు మళ్లీ మొదలు కానుండడంతో మాసమంతటా ప్రతి ఇంటా శ్రావణ శోభతో అలరారే పండుగలు, సామూహిక వ్రతాలు సందడి చేయనున్నాయి. శ్రావణంలో భక్తిశ్రద్ధలతో ఆచరించే ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక కోణమే కాకుండా సామాజిక, వైజ్ఞానిక అంశాలెన్నో దాగున్నాయని పెద్దలు చెబుతారు. మానవ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శ్రావణ మాసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 27 వరకు ఉంటుంది. ఇప్పటికే శ్రావణమాస పూజల కోసం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. ఈనెల తప్పితే మళ్లీ డిసెంబరు వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో ఫంక్షన్ హాల్స్, కల్యాణమండపాలు బిజీగా మారనున్నాయి. మహిళలకు ప్రీతికరం శ్రావణ నోములు, వ్రతాలు భక్తితోనోచుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటామన్న విశ్వాసముండడంతో మహిళలు ఈ మాసాన్ని అత్యంత ప్రీతికరంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అని పేరొచ్చింది. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడైన వేంకటేశ్వరస్వామి ఇదే నక్షత్రంలో జన్మించినందున శ్రీవారి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి, ఆయన సతీమణి లక్ష్మీదేవి, సోదరి గౌరికి ఇదే మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో పలు ఆలయాల్లో సామూహిక వ్రతాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణంలో వచ్చే మంగళవారాలతో పాటూ శుక్రవారాలు, శనివారాలు ఆలయాలు ప్రత్యేక పూజలు, భక్తులతో కిటకిటలాడుతాయి. (చదవండి: 'మామ్పవర్ 360’.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మహిళలను తిరిగి..) శ్రావణంలో వచ్చే పండుగలివే.. శ్రావణ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. వచ్చే నెల 1న రానున్న నాగుల చవితితో పర్వదినాలు ఆరంభమవుతాయి. మరుసటి రోజుననే గరుడ పంచమిని జరుపుకుంటారు. 5న వరమాలక్ష్మీ వ్రతం, 12న రక్షాబంధనం (రాఖీ పౌర్ణిమ), 18, 19 తేదీల్లో వచ్చే శ్రీకృష్ణజన్మాష్టమితో పాటూ బలరామ జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి పండుగలు వరుసగా ఆనందాలను తెచ్చేవే. మాసం చివరిరోజున కూడా పొలాల అమావాస్యను జరుపుకోవడం ఆనవాయితీ. వ్రతాలకు శ్రావణమాసాన్ని ఎంచుకోవడంలో ఆరోగ్యపరమైన కారణాలున్నాయని, ప్రత్యేక పూజలకు సన్నాహాలు చేస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. (చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?) -
గుండెల‘ధర’తున్నాయి..!
సాక్షి, శ్రీకాకుళం: ఏడాదిలో అత్యంత భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహించే మాసాల్లో కార్తీక మాసం, శ్రావణ మాసాలు ముఖ్యమైనది. దీనిలో భాగంగా శుక్రవారాల్లో వరలక్ష్మీ దేవికి నిష్టతో పూజలు నిర్వహించి, కుటుంబ మంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అయితే ఆడపడుచుల భక్తి భావాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నేడు శ్రావణ శుక్రవారం కావడంతో మార్కెట్లో అమాంతం పూజా సామగ్రికి ధరలు పెంచేశా రు. ఫలితంగా సామగ్రిని కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. పసిడి పైపైకి... మహిళలంతా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావాలని బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈ ఏడాది మాత్రం పసిడి ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. గత నెలలో తులం బంగారం ధర రూ.37 వేలు ఉండగా..ప్రస్తుతం రూ.43,300లకు పైగా ఉంది. దీంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో కొన్ని షాపులకు బోణీ కూడా పడడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పువ్వులు తక్కువగా వస్తున్నాయి జిల్లాలో ప్రస్తుతం పండే పువ్వులు ఏమీ లేవు. అక్కడక్కడ బంతి పువ్వులు మాత్ర మే దొరుకుతున్నాయి. చామంతి, గులాబీ, కనకాంబరాలు, లీల్లీ పువ్వులు, మల్లి పువ్వులు, సంపంగి వంటి పువ్వులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నాము. బుట్టలతో మేము కొనుగోలు చేస్తాం. శ్రావణ మాసం కావడంతో బుట్ట పువ్వులకు రూ.10 వేలకు పైగా చెల్లించాల్సి వస్తోంది. కొన్న పువ్వుల్లో చాలావరకు పాడై పోతున్నాయి. ఏమి చేయాలో తెలియక కొనుగోలుదారుల మీద ఆ భారం వేయాల్సి వస్తోంది. శ్రావణ మాసం అయిపోయాక పువ్వులు కొనేవారే కరువవుతారు. –ఎ.రాజు, పువ్వుల వ్యాపారి, ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీకాకుళం వర్షాలకు సరుకు రావడం లేదు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోయి సరుకులు రావడం లేదు. రెండు మూడు రోజు లు రవాణా నిలిచిపోవడంతో పండ్లు కుల్లిపోయి పాడవుతున్నాయి. దీంతో వచ్చిన సరుకు అధిక ధరలకు అమ్మాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష వంటి వాటిని అధిక ధరలకు అమ్మక తప్పడం లేదు. హోల్‌సేల్ వ్యాపారు ల నుంచి కొంచెం కొంచెం కొనుగోలు చేసి రిటైల్‌గా అధిక ధరలకు అమ్మక తప్పడం లేదు. బేరాలు ఉన్నప్పుడే నష్టాన్ని పూడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. –కె.బాలాజీ, పండ్ల వ్యాపారి, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, శ్రీకాకుళం వ్యాపారాలు సరిగా లేవు శ్రావణం మాసంలో బంగారం ధరలు పెరగడంతో వ్యాపారాలు పడిపోయాయి. గతేడాది శ్రావణ మాసంలో కాస్తా వ్యాపారాలు అనుకూలంగానే జరిగాయి. ఈ ఏడాది మాత్రం ఆశించిన స్ధాయిలో కాదు అసలు చాలామంది వ్యాపారులకు బోణీ కూడా పడడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిస్తేనే కొనుగోళ్లు పెరుగుతాయి. బంగారం కొనలేకపోతున్నాం ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఈ ఏడాది మాత్రం బంగారం ధరలు ఒక్కసారిగా రూ.5 వేలకు పైగా పెరగడంతో భారమైంది. ధరలు తగ్గుముఖం పడితే కొనేందుకు అవకాశం కలుగుతుంది. –తంగి రాజేశ్వరి, మహిళ, శ్రీకాకుళం -
ముగిసిన శ్రావణమాస ఉత్సవాలు
నారాయణపేట రూరల్ : పట్టణ వీరశైవ సమాజం, లింగ బలిజ కులస్తులు ఆదివారం శ్రావణమాస ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బసవేశ్వర మందిరంలో అర్చకులు బుస్సయ్యస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురవీధుల గుండా జల్ధిబిందె ఊరేగింపు నిర్వహించారు. స్వామి వారి పల్లకీసేవను కన్నులపండువగా చేపట్టారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో జాజాపూర్ సిద్రామప్ప, జయప్రకాష్, బాలింగం, శివకుమార్, మల్కెడ్ జగదీష్, దామరగిద్ద శివరాజ్, మల్లు, మంగిలి సంఘు, శ్రీధర్, అప్పి, ఆకుల బాబు, సులెగం నాగరాజ్, లక్ష్మికాంత్, జ్యోతిర్నాథ్, మోర్లపల్లి జగదీష్, గందె మల్లికార్జున్, వినోద్, డీబీ. సంపత్, వీరన్న పాల్గొన్నారు. -
రాజన్న శ్రావణమాసం ఆదాయం రూ. 4 కోట్లు
కొనసాగిన భక్తుల రద్దీ నేటితో ముగియనున్న శ్రావణమాసం వేములవాడ : శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్నకు రూ.4 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెల రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో హుండీ ద్వారా మరింత ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు తెలిపారు. గురువారంతో శ్రావణమాసం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బద్ధి పోచమ్మ ఆలయంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. -
శ్రావణం..భక్తిపారవశ్యం
-
శ్రావణం.. శుభకరం
మదనపల్లె సిటీ సుముహుర్తాలకు శ్రావ్యమైనది.. మేఘ, వర్ష పరియమైనది.. పుడమి తల్లికి పచ్చదనం నింపేది.. వ్రతాలు, నోములు.. పూజలకు నెలవైనది.. మంగళ కరమైనది.. శుభకరంగా నిలిచే మాసం శ్రావణం. అందుకే ఈ నెల లక్ష్మీమాసంగా పేరు పొందింది. శ్రావణం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలపై ప్రత్యేక కథనం. శ్రావణం రాకతో ఊరు వాడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆలయాలు సొబగులు దిద్దుకున్నాయి. ప్రతి ఇంటా గడపలు రంగవల్లికలతో ముస్తాబవుతున్నాయి. ముహూర్తాలు వచ్చేశాయి. అమ్మవారి ఆలయాలు కొత్తకళను సంతరించుకున్నాయి. మనసుకు ప్రశాంతత కల్పించే ఈ మాసంలో మహిళలు సకల సౌభాగ్యాలతో పాటు శ్రీమహాలక్ష్మి అమ్మవారి కటాక్షం పొందేందుకు వ్రతాలు, ఉపవాసాలు, ఆరాధనలు ప్రారంభించారు. మహిళలంతా భక్తిప్రపత్తులతో శ్రీగౌరి, శ్రీ మహాలక్ష్మి వ్రతాలు, కుంకుమపూజలు ఆచరిస్తున్నారు. పున్నమి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుందని ప్రముఖ వేదపండితులు లక్ష్మణస్వామి తెలిపారు. శ్రావణ శుక్రవారం పూజలు ప్రారంభం జిల్లాలో శ్రావణ శుక్రవారం పూజలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఒక శుక్రవారం గడిపోవడంతో మహిళలు రాబోవు వారాల్లో పూజలకు సమాయత్తమవుతున్నారు. ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లోనూ శ్రావణ లక్ష్మి పూజలు చేస్తారు. ఈ ఏడాది శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాలు, నాలుగు మంగళవారాలు వచ్చాయి. ఆగస్టు 22న వరలక్ష్మివత్రం చేయాల్సి ఉంది. వివాహితులు ఈ నెలలో నోములు, వ్రతాలతో గడుపుతారు. వరలక్ష్మివత్రం రోజున అమ్మవారికి కలశం పెట్టి నిండుగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇలా చేస్తే అయురారోగ్యాలతో పాటు సౌభాగ్యం లభిస్తుందని విశ్వాసం. ఆలయాలు ముస్తాబు శ్రావణ మాసం సందర్భంగా జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాలుతో పాటు ప్రముఖ ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల్లో నిత్యం వ్రతాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్రతాలు, హోమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పండుగల మాసం.. శ్రావణం శ్రావణ మాసం పండుగలు, వ్రతాలకు ప్రతీతి. ఈ నెలలో ప్రధానంగా 7వ తేదీన నాగుల పంచమి, 12న వరలక్ష్మీవ్రతం, 13న తిరుమల శ్రీవారి పవితోత్సవం ప్రారంభం, 14న పుత్ర ఏకాదశి, 16న తిరుమల శ్రీవారి పవితోత్సవాలు సమాప్తం, 18న రాఖీ పౌర్ణమి, 21న సంకష్ట హరచతుర్థి, 25న శ్రీకష్ణుడి జన్మదినమైన గోకులాష్టమి, అలాగే హయగ్రీవ, రాఘవేంద్ర జయంతులు, పుత్రదా, కామికి ఏకాదశలు ఈ నెలలోనే వస్తాయి. తమ భర్తలు, కుమారులు పంటపొలాల్లో సంచరించే సమయంలో ఎలాంటి హానీ తలపెట్టోందని నాగేంద్రుడిని మహిళలు పూజించే పండుగే నాగుల పంచమి. సోదర క్షేమాన్ని, తమకు రక్షణ భాగ్యాన్ని కల్పించమని కోరుతూ నిర్వహించేదే రాఖీ పౌర్ణమి మరో ముఖ్యమైన వేడుక. అలాగే యజ్ణోపవీతాన్ని ధరించేందుకు జంధ్యాల పౌర్ణమి. గ్రామదేవతలను కొలిచేందుకు పోలాల అమావాస్య పండుగలను ఈ మాసంలో వస్తాయి. వ్రతాలకు ప్రతీతి శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మహిళలు మంగళగౌరిని పూజిస్తారు. పార్వతీ దేవికి మరో పేరే మంగళగౌరి. కొత్తగా వివాహమైన వధువులు ఈ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యం. ఐదోతనం కలకాలం సిద్ధిస్తుందని విశ్వాసం. మరో ముఖ్యమైన శ్రీవరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్మిలను కొలిచినట్టే. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించడానికి జిల్లాలోని మహిళలు ఎదురుచూస్తున్నారు. నిత్యదర్శనం.. యోగ్యదాయకం వ్రతాలు, నోములు అచరించడం వీలుకానివారు నిత్యం ఆలయాలను సందర్శించి దైవదర్శనం చేసుకోవడం ద్వారా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఉపవాసదీక్ష చేస్తే దైవానుగ్రహానికి మార్గం సుగమవుతుంది. మనిషిలో ప్రవర్తలోనూ విశేష మార్పు వస్తుంది. ––విశేశ్వరస్వామి, జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు -
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
-
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
వేములవాడ : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రావణసందడి మొదలైంది. శ్రావణ మాసంలో శివాలయాల సందర్శనను భక్తులు శుభప్రదంగా భావిస్తారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయ ఆవరణంతా కిక్కిరిసిపోయింది. రద్దీతో అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. దీంతో కొందరు భక్తులు అసహనం వ్యక్తంచేశారు. భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలాచరించి కోడె మొక్కులు చెల్లించుకునానరు. బాలత్రిపుర సుందరీ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరీనాథ్, దేవేందర్, హరికిషన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీఐపీల దర్శనాలను పీఆర్వో చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించారు. -
వరమహాలక్ష్మిగా దుర్గమ్మ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తోంది. శుక్రవారం వేకువజామున అమ్మవారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక అలంకారం చేసిన తర్వాత ఉదయం 8.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ముఖమండపం నుంచే దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. అదనంగా ఒక క్యూలైన్ సహా మొత్తం ఐదు క్యూలైన్లను అందుబాటులో ఉంచారు.