పామర్రు: గత మూడు నెలలుగా వివాహాలకు ముహూర్తాల్లేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు, యువతీయువకులకు శ్రావణ మాసం ‘శుభ’ఘడియలు తెచి్చంది. ఇప్పటి వరకు ఆషాఢం, శూన్య మాసాల నేపథ్యంలో ముహూర్తాల్లేక వివాహాది కార్యక్రమాలు నిలిచిపోయాయి. సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవడంతో పెళ్లిళ్ల బాజాలు మోగనున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 28 వరకు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో పెళ్లి సందడి మొదలైంది.
ఈ శ్రావణ మాసంలో 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీలు వివాహాలకు, గృహ ప్రవేశాలకు మంచి ముహూర్తాలు కాగా, 17, 18 తేదీలు అత్యంత శుభ ముహూర్తాలని పురోహితుడు భేతనభొట్ల ఫణికుమార్‌శర్మ తెలిపారు. దీంతో చాలా రోజుల తర్వాత కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి. చాలా మందికి చేతి నిండా పని దొరకనుంది. పురోహితులు, భజంత్రీలు, పూల అలంకరణలు, ట్రావెల్స్, షామియానాలు, క్యాటరింగ్, బ్యూటీíÙయన్లు, డీజేలతో పాటు కూలీలకు మంచి డిమాండ్ పలకనుంది.
Comments
Please login to add a commentAdd a comment