దుర‍్గమ‍్మకు టీటీడీ పట్టువస్త్రాలు
విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ బృందం గురువారం ఉదయం దుర్గగుడికి చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ జేఇఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, డాలర్ శేషాద్రి తదితరులు అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ దుర్గా నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రతిఏటా టీటీడీ నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ గా వస్తోందని, దానిలో భాగంగా వస్త్రాలను అందచేశామని అన్నారు.