దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పల్లె
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన పల్లె రఘునాథరెడ్డికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.