చిత్తూరు: ఏపీ పర్యటనలో మోదీ ప్రత్యేకహోదా అంశం ప్రస్తావించక పోవడాన్ని వైఎస్సాఆర్ సీపీ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
గత ఎన్నికల ప్రచారంలో శ్రీనివాసుని సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ.. ఇప్పుడు దుర్గమ్మ సాక్షిగా మాట తప్పారని అన్నారు. అధికారం కోసమే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకహోదాను పలికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా అవసరమే లేదనట్లు మాట్లాడుతున్నారని అన్నారు.