దుర్గమ్మ దర్శనానికి కొనసాగుతున్న రద్దీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి ) :
దుర్గమ్మను యాత్రికులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. సోమవారం సుమారు 1.30 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేశారు. 20 వేల మందికి అన్న ప్రసాదాన్ని అందజేశారు.
2.70 లక్షల లడ్డూలు సిద్ధం
పుష్కర యాత్రికుల కోసం అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు 2.70 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. దేవస్థానానికి సోమవారం రూ. 22,75,600 ఆదాయం వచ్చింది.
లిఫ్టుపై కొనసాగుతున్న వివాదం
పుష్కరాల్లో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులకే లిఫ్టు సదుపాయం కల్పిస్తున్నామని దుర్గగుడి అధికారులు చెబుతుండగా, పూర్తి స్థాయిలో పోలీసు సిబ్బందే వినియోగించుకోవడం విమర్శలకు దారి తీస్తోంది.