బొజ్జ గణపయ్య నవరాత్రులు పూర్తైన వెంటనే దసరా సందడి, హడవిడి మొదలైపోతుంది. ఇక శిల్పులంతా దుర్గాదేవి విగ్రహాల తయారీలో తలమునకలై ఉంటారు. అయితే ఈ దుర్గమ్మ విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత ఉంది. అది అనాదిగా వస్తున్న సంప్రదాయమని చెబుతున్నారు శిల్పకారులు. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వింత చూసి ఎంతైన 'అమ్మ' కదా ఏ బిడ్డను చులకనగా వదిలేయదు కదా..అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా ప్రత్యకత అంటే..
దుర్గమ్మ విగ్రహాలు తయారు చేయాడానికి నాలుగు విషయాలు అత్యంత కీలకం. తయారీకి శిల్పులు గంగానది ఒడ్డును ఉన్న మట్టి, గోవు పేడ, గో మూత్రం, ఇంకా వేశ్యల ఇంటిలోని మట్టిని ఉపయోగిస్తారు. ఈ మట్టిని ” నిషిద్ధో పల్లిస్ ” అని పిలుస్తారు. ఇందులో ఏది లేకపోయినా విగ్రహం అసంపూర్ణమని వారు భావిస్తారట.
అంతేగాదు అందుకోసం ప్రతి శిల్పకారుడు వేశ్య గృహాలకు వెళ్లి వారి ప్రాంగణంలో మట్టి కావాలని అభ్యర్థిస్తారట. తమకు మట్టి లభించేవరకు వాళ్లని ప్రాధేయపతారు. అంతేగాదు దసరా సీజన్ రాగానే వారిని గౌరవంగా, చిరునవ్వుతో పలకరించి మరీ మట్టిని తీసుకునే ప్రయత్నం చేస్తారట శిల్పకారులు. ఈ ఆచారాన్ని బెంగాలీ శిల్పకారులు ఇప్పటికీ పాటిస్తుండటం విశేషం. ఎందుకు ఇలానే అనేందుకు స్పష్టమైన వివరణ లేదు. కానీ కొన్ని కథానాలు మాత్రం వినిపిస్తున్నాయి.
ఆ కారణం ఏంటంటే..
దుర్గాదేవి మహిషాసురిడితో తలపడుతున్న సమయంలో ఆమెను తాకే ప్రయత్నం చేశాడట. దీంతో ఆమె కోపంతో తన పరాక్రమాన్ని అంతా ఉపయోగించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. అందుకే ఆ సంప్రదాయమని పండితుల వచనం. మరొక కథనం ప్రకారం..నారీ శక్తికి సూచన దుర్గమ్మ. సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని తీసుకువచ్చారని చెబుతుంటారు.
అంతేగాదు ఇలా వేశ్య ఇంటిలోని మట్టితో దుర్గామాత విగ్రహం తయారు చేస్తే అందులోకి అమ్మవారి కళ వచ్చి శోభాయమానంగా కనిపిస్తుందట. మన పెద్దలు ఈ సంప్రదాయం ఎందుకని పెట్టారో స్పష్టంగా తెలియకపోయినా.. దేవుడి దృష్టిలో అందరూ సమానమే..ఎవ్వరిని కించపరచకూడదు, హేయభావంతో చూడకూడదు అనే చక్కని సందేశాన్ని ఇస్తోంది ఈ ఆచారం..!
Comments
Please login to add a commentAdd a comment