Dussehra Festival
-
పండుగకు పుట్టింటికి పంపలేదని..
చేర్యాల(సిద్దిపేట): దసరా పండుగకు పుట్టింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ పీ.నీరేశ్ కథనం మేరకు.. ఆకునూరు గ్రామానికి చెందిన పెంటపర్తి శ్రావణ్రెడ్డికి హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, క్యాతంపల్లికి చెందిన సౌమ్య (24)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. కొద్ది రోజులుగా సౌమ్య తల్లిదండ్రులు గొడవపడి వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే గొడవ విషయాన్ని సౌమ్య తండ్రి రాంరెడ్డి అల్లుడై శ్రావణ్‌కి ఫోన్ చేసి చెప్పాడు. ఆత్తమ్మ, నేను వేర్వేరుగా ఉంటున్నామని పండుగకు పంపొద్దన్నాడు. దీంతో సౌమ్యని పండుగకు పంపలేదు. మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలికి 14 నెలల పాప ఉంది. తల్లి మంజుల ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బస్సు చార్జీల పెంపు అవాస్తవం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ బస్సుల చార్జీలను మాత్రమే సంస్థ సవరించిందని, రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఒక ప్రకటనలో తెలిపారు.పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేప్పుడు బస్సుల్లో ప్రయాణికులు అధికంగా ఉంటారని, వారిని దింపి బస్సులు ఖాళీగా నగరానికి రావలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో డీజిల్ ఖర్చుకు సరిపడా ఆదాయం కూడా ఉండదని తెలిపారు. అందుకోసం స్పెషల్ బస్సుల్లో చార్జీలను స్వల్పంగా సవరించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. -
#DussehraFestival : దేశ వ్యాప్తంగా రావణ దహనం (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
-
దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?
Vijayadashami: దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులూ, పదవ రోజు విజయ దశమినీ కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చేపండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికీ, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికీ, తరువాత మూడురోజులు సరస్వతీ దేవికీ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతు కమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలి చిన సందర్భమే కాక... పాండవులు అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలు తీసుకున్నరోజు కూడా! ఈ సందర్భంగా ‘రావణ వధ’, జమ్మి ఆకుల పూజ వంటివి చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందినందుకు 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకొంటారు.బ్రహ్మ దేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశ వంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ జన్మించింది. సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపం, సింహం రూపం, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు మహిషం రూపంలో దేవి చేతిలో హతుడైనాడు.చదవండి: దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"తెలంగాణలో పాలపిట్టను చూసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు పోయి పూజలు చేసి జమ్మి ఆకులు (బంగారం) పెద్ద వాళ్లకు ఇస్తూ వారి దీవెనలు తీసుకుంటారు. ఒకరినొకరు ‘అలాయ్ బలాయ్’ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దసరా ఒక మహోన్నతమైన పర్వదినం. – దండంరాజు రాంచందర్ రావు -
తిరుమల : సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
నవరాత్రుల్లో ముద్దుగుమ్మల స్టన్నింగ్ ట్రెడిషనల్ లుక్స్..! (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ (ఫొటోలు)
-
దుర్గార్తిశమనీ దశదిశలా దసరా
జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గాదేవిని దుర్గార్తిశమనీ అని స్తుతిస్తోంది.ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని, చివరి రోజైన దశమి రోజును విజయ దశమిగా, దసరా పండుగగా జరుపుకుంటారు గనుక వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు.‘భూతాని దుర్గా! భువనాని దుర్గా! స్త్రీయో నరాశ్చపి పశుశ్చ దుర్గా!యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా! దుర్గా స్వరూపాదపరం న కించిత్.’పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ప్రాణికోటి దుర్గా స్వరూపమే! సమస్త లోకాలూ దుర్గా స్వరూపమే! స్త్రీలు పురుషులు పశువులు అన్నీ దుర్గా స్వరూపమే! లోకంలో కంటికి కనిపించేవన్నీ దుర్గా స్వరూపమే! దుర్గా స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. దుర్గాదేవిని నమ్ముకున్న భక్తుల భావన ఇది.దేవీ నవరాత్రులను అష్టాదశ శక్తిపీఠాలు సహా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో విశేషంగా జరుపుకొంటారు. నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి, రోజుకో నైవేద్యాన్ని నివేదిస్తారు.నవరాత్రులలో కనకదుర్గాదేవి అలంకారాలు1 మొదటిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా తీపి బూందీ, సుండలు సమర్పిస్తారు.2 రెండో రోజున శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు.3 మూడో రోజున శ్రీ గాయత్రీదేవిగా కనకాంబరంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.4 నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.5 ఐదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను సమర్పిస్తారు.6 ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం సమర్పిస్తారు.7 ఏడో రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం, దధ్యోదనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు సమర్పిస్తారు.8 ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా ఎరుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. పులగం, పులిహోరలను నైవేద్యంగా సమర్పిస్తారు.9 తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనిగా ముదురు గోధుమరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులగం, పులిహోర, గారెలు, నిమ్మరసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు.10 పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఆకుపచ్చరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తారు.నవదుర్గల ఆరాధనదసరా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో కూడా పూజిస్తారు. శ్రీచక్రంలోని నవచక్రాలలో కొలువుండే దుర్గాదేవి నవరూపాల గురించి బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతోంది. వరాహ పురాణం చెప్పిన ప్రకారం–ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చసప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనాఈ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గా రూపాలలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మిదిరూపాల ప్రస్తావన మరోవిధంగా ఉన్నా, వాటిని నవదుర్గలుగా పేర్కొనలేదు. దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే రూపాల ప్రస్తావన ఉంది. కొన్నిచోట్ల నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపాలలో కూడా ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. శమీపూజనవరాత్రుల చివరి రోజైన విజయ దశమినాడు శమీపూజ చేయడం ఆనవాయితీ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను, వస్త్రాలను ఎవరికీ కనిపించకుండా శమీవృక్షం– అంటే జమ్మిచెట్టు మీద దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు శమీవృక్షానికి పూజించి, దానిపై తాము దాచుకున్న ఆయుధాలను వస్త్రాలను తిరిగి తీసుకున్నారు. శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అపరాజితా దేవి ఆశీస్సులతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి, రావణునిపై విజయం సాధించినట్లు రామాయణం చెబుతోంది. ఈ సందర్భంగా చాలాచోట్ల ఆయుధపూజలు కూడా జరుపుతారు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనమైన తర్వాత శమీవృక్షం వద్దకు చేరుకుని, అపరాజితా దేవిని పూజించిన తర్వాత– ‘శమీ శమయుతే పాపం శమీ శత్రు వినాశినీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు శమీ అష్టోత్తరాన్ని కూడా పఠించి, పూజ జరుపుతారు. శమీపూజ చేయడం వల్ల అపరాజితా దేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకొంటారు. రకరకాల రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ నవరాత్రుల రోజులలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు ‘గ్రామ కుంకుమ నోము’, ‘కైలాసగౌరీ నోము’ వంటి నోములను నోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలను సమర్పిస్తారు.పూల వేడుక బతుకమ్మ పండుగఎంగిలిపూల బతుకమ్మ: మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యప్పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండో రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.నానేబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు వేడుకను నానేబియ్యం బతుకమ్మ అంటారు.ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.అట్ల బతుకమ్మ: ఐదో రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.అలిగిన బతుకమ్మ: ఆరో రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు.వేపపండ్ల బతుకమ్మ: ఏడో రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపిన బియ్యప్పిండితో వేపపండ్లలా వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం వెన్నముద్ద లేదా నెయ్యిలో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకొంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం– ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ తొమ్మిదిరోజుల పూల పండుగను జరుపుకొంటారు. పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గర్లో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. పన్యాల జగన్నాథదాసు -
వందకొట్టు.. మేకను పట్టు
లింగాలఘణపురం: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు యువకులు ‘దసరా బొనాంజా’ పేరుతో ప్రకటించిన ఆఫర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రూ.100తో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ.. మద్యం, మాసం పేరుతో సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. రూ.100కు ప్రథమ బహుమతిగా మేక, రెండో బహుమతిగా రెండు బ్లెండర్స్ ప్ర్పైడ్ ఫుల్ బాటిళ్లు, మూడో బహుమతిగా ఒక కార్టన్ బీర్లు, నాలుగో బహుమతిగా 2 నాటు కోళ్లు, అయిదో బహుమతిగా రాయల్‌స్టాగ్ ఫుల్ బాటిల్ అని పేర్కొన్నారు. 4వ తేదీ సాయంత్రం నుంచి అంబేడ్కర్ విగ్రహం వద్ద టోకెన్లు అమ్ముతారని, 11వ తేదీన డ్రా తీస్తామంటూ.. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, పేర్లు సైతం పెట్టారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ఇది వైరల్ అవుతోంది.దసరా బొనాంజా అంటూ టోకెన్లులింగాలఘణపురం: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు యువకులు ‘దసరా బొనాంజా’ పేరుతో ప్రకటించిన ఆఫర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రూ.100తో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ.. మద్యం, మాసం పేరుతో సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. రూ.100కు ప్రథమ బహుమతిగా మేక, రెండో బహుమతిగా రెండు బ్లెండర్స్ ప్ర్పైడ్ ఫుల్ బాటిళ్లు, మూడో బహుమతిగా ఒక కార్టన్ బీర్లు, నాలుగో బహుమతిగా 2 నాటు కోళ్లు, అయిదో బహుమతిగా రాయల్‌స్టాగ్ ఫుల్ బాటిల్ అని పేర్కొన్నారు. 4వ తేదీ సాయంత్రం నుంచి అంబేడ్కర్ విగ్రహం వద్ద టోకెన్లు అమ్ముతారని, 11వ తేదీన డ్రా తీస్తామంటూ.. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, పేర్లు సైతం పెట్టారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ఇది వైరల్ అవుతోంది. -
భక్తిశ్రద్ధలతో ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజలు (ఫొటోలు)
-
నవరాత్రుల్లో ఇండో వెస్ట్రన్ మెరుపుల్లో మగువలు కళ (ఫోటోలు)
-
‘బీ న్యూ’ దసరా ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ‘బీ న్యూ మొబైల్స్’ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ, వివో, ఒప్పో, రియల్‌మి, మొబైల్స్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు లక్కీడ్రా ద్వారా రూ.10 లక్షల నగదు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50% వరకు, యాక్సెసరీస్‌పై 80% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ల్యాప్‌టాప్‌పై రూ.10 వేలు, టీవీ కొనుగోలుపై రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. టీవీఎస్ కార్డు ద్వారా కొనుగోలుపై ఒక ఈఎంఐ ఉచితంగా, ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. బజాజ్‌ఫిన్‌సర్వ్ ద్వారా వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు సదుపాయం కల్పిస్తోంది. ప్రత్యేక ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఈడీ సాయి నితీష్‌లు తెలిపారు. -
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇక్కడ దసరా మామూలుగా ఉండదు
దసరా పండుగ దేశమంతా ఒక తీరున... బెంగాల్లో ఒక తీరున జరుగుతుంది. కోల్‌కతాలోని కుమార్తులి అనే వాడ అంతా దుర్గ విగ్రహాల తయారీ,కొనుగోళ్లతో కోలాహలంగా మారుతుంది. పురుషులతోపా టు స్త్రీలు కూడా విగ్రహాలు తయారు చేస్తారు. బెంగాలీల నవ రూప దుర్గలుగా కనిపించడానికి అక్కడ సెలబ్రిటీలు ఉవ్విళ్లూరుతారు. ఒక టీవీ చానెల్ స్పెషల్ షో కోసం ముస్తాబైన నవరూప దుర్గలు వీరు... ఆ అవతారాల పేర్లు, ఇతర బెంగాల్ దసరా విశేషాలు...2024లో బెంగాల్లో దుర్గ పూజ వల్ల జరిగే సృజనాత్మకత ఆర్థిక లావాదేవీల అంచనా ఎంతో తెలుసా? 50 వేల కోట్లు. సృజనాత్మక ఆర్థిక లావాదేవీలు అంటే? దుర్గ విగ్రహాల తయారీ, మంట΄ాల ఏర్పాటు, అలంకరణ, వినోద కార్యక్రమాలు, పూజా సామగ్రి, భోజనాలు, పబ్లిసిటీ సామగ్రి, స్పాన్సర్‌షిప్‌లు, యాడ్లు, పుస్తకాల ప్రచురణ... ఇవన్నీ 50 వేల కోట్ల మేరకు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి కుటుంబం ఈ వేడుకల్లోపా ల్గొంటుంది. కోల్‌కతా అంతా 3000కు పైగా దుర్గ మంట΄ాలు వెలుస్తాయి. హైదరాబాద్‌లో గణపతి మంట΄ాల్లాగే కోల్‌కతాలో అతి పెద్ద విగ్రహాలు పెట్టడానికి కూడా జనం ఉత్సాహపడతారు. నవరాత్రుల్లో నగరం నలుమూలలా పూజలు జరుగుతుంటే ప్రత్యేకంగా కోటి రూ΄ాయల ఖర్చుతో జరిగే పూజలు కనీసం 200 ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే దసరా అంటే బెంగాల్ బెంగాల్ అంటే దసరా.17వ శతాబ్దం నుంచిదుర్గ పూజ ఒకప్పుడు బెంగాల్లో జమీందారుల పండగగా ఉండేది. అయితే 1610లో సబర్ణ రాయ్ చౌదరి అనే జమీందారు కుటుంబం ప్రజల మధ్యలో తెచ్చి దుర్గ పూజ వేడుకలు మొదలెట్టింది. ఆ తర్వాత జమీందార్లు, శ్రీమంతులు కోల్‌కతాలో దుర్గపూజ ఆర్భాటంగా చేయసాగారు. 1910లో కోల్‌కతాలో కొద్దిమంది సామాన్యులు చందాలు వేసుకొని మొదటి దుర్గా మంట΄ాన్ని నవరాత్రుల్లో మొదలెట్టారు. దాంతో జనం పోగయ్యి వాడవాడల దుర్గ మంట΄ాలు స్థాపించుకునే ఆనవాయితీ వచ్చింది. అయితే 1985లో ఆసియన్ పెయింట్స్ వారు కోల్‌కతాలోని దుర్గ మంట΄ాల్లో ఉత్తమమైన వాటికి బహుమతులు ఇవ్వడంప్రారంభించే సరికి ఇక పోటాపోటీ మొదలయ్యి సృజనాత్మకంగా ఒకరికి మించి ఒకరు దుర్గ మంట΄ాలను విస్తృతం చేయసాగారు. ఆ తర్వాత కోల్‌కతాలోని ఎన్నో సంస్థలు నేడు దుర్గ మంట΄ాలకు అవార్డులు ఇస్తున్నాయి. స్త్రీల పండుగదుర్గ అంటే శక్తి. దసరా అంటే మహిళా శక్తికి ప్రతీక. అందుకే బెంగాల్లో స్త్రీలు దసరాను చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజుల్లో ఎర్రంచు ఉన్న తెల్లచీర, ఎర్రగాజులు, కుంకుమ బొట్టుతో కళకళలాడతారు. నవరాత్రుల్లో చివరి రోజు వీరంతా ‘పుట్టింటికి వచ్చిన దుర్గమ్మ తిరిగి అత్తవారింటికి వెళ్లిపోతున్న’ సందర్భంగా ‘సిందూర్ ఖేలా’ అనే ఆటను ఆడతారు. వివాహితలు ఒకరికి ఒకరు కుంకుమ బొట్టు పెట్టుకుని ఆనందిస్తారు. ఇలా చేస్తే తమ సౌభాగ్యం చెక్కు చెదరదని భావిస్తారు.కుమార్ తులిలో విగ్రహాలుకోల్కతాలో కుమార్ తులి అనేప్రాంతంలో సంవత్సరం అంతా దుర్గ విగ్రహాలు తయారు చేస్తూనే ఉంటారు. ప్రతి బొమ్మను విలక్షణంగా తీర్చిదిద్దడమే కాదు ఆ విగ్రహానికి అమర్చే దుస్తులు, నగలు కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఒక్కో విగ్రహం పది వేల నుంచి రెండు–మూడు లక్షల వరకూ ఉంటుంది. కుమార్ తులిలో చినపా ల్, నమితాపా ల్, మాలాపా ల్, కోకిలాపా ల్ అనే నలుగురు అక్కచెల్లెళ్లు దుర్గ విగ్రహాల తయారీలో పేరు గడించారు.నవ దుర్గలువిగ్రహాలతోపా టు సెలబ్రిటీలు కూడా ఈ సందర్భంగా దుర్గ అవతారాలను ధరించి వివిధ షోలలోపా ల్గొంటూ ప్రేక్షకులకు ఉత్సాహం కలిగిస్తారు. జీ బెంగాలీ చానల్ ఈ సంవత్సరం తమ సీరియల్స్‌లో నటించే నటీమణుల చేత నవ దుర్గలపా త్రలు ధరింప చేసి అందరినీ ఆకట్టుకుంది. బెంగాల్ వారు నవరాత్రుల సందర్భం గా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ నవ దుర్గలను ఆవిష్కరిస్తారు. -
ఇంద్రకీలాద్రి : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ : భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో దసరా వేడుకలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
దసరా ఆఫర్.. మేకపోతు @ రూ.116
-
రూ.51 కొట్టు.. మేకను పట్టు..!
చిట్యాల, మర్రిగూడ: దసరా పండగ సమీపిస్తుండటంతో గ్రామాల్లో సందండి నెలకొంటోంది. చిట్యాల, మర్రిగూడ తదితర మండలాల్లో దసరా పండుగ సందర్భంగా యువకులు సరికొత్త స్కీం ప్రారంభించారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో కొందరు యువకులు “51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు’ అని ప్రచారం చేస్తున్నారు. ఈ స్కీంలో 51 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే.. కూపన్ల నుంచి డ్రా తీస్తారు. మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేక, రెండో బహుమతిగా రెండు లిక్కర్ బాటిళ్లు, మూడో బహుమతిగా మరో రెండు లిక్కర్ బాటిళ్లు, నాలుగో బహుమతిగా రెండు కడక్‌నా«థ్ నాటు కోళ్లు, ఐదో బహుమతిగా కాటన్ బీర్లు ఇచ్చేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వంద రూపాయల స్కీంమర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో మరో తీరుగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు చెల్లించి కూపన్ తీసుకున్న వారిలో నుంచి డ్రా తీసి మొదటి బహుమతి 10కిలోల మేక, రెండవ బహుమతి రెండు మద్యం బాటిళ్లు(బ్లెండర్ స్ప్రైడ్), మూడవ బహుమతి కాటన్ బీర్లు, నాలుగవ బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదవ బహుమతి ఒక మద్యం బాటిల్ అందించనున్నామని, వచ్చే నెల 10న గ్రామంలో డ్రా తీయనున్నట్లు నిర్వాహకులు బ్యానర్ ఏర్పాటు చేశారు. కాగా, ఈ ప్రచారాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. -
దసరా పండుగ విశిష్టత ఇదీ!
ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా.దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం.తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము.జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది.మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం. ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు.యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా !నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!!పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు.అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తి ్తగా భాసించింది. ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది.జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాం.విజయదశమి జరుపుకోవటంలోఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలోని దైవ శక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజం లో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశం.ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని పూజిస్తాం.‘శమీ శమయతే పాపంశమీ శత్రు వినాశినీ!అర్జునస్య ధనుర్ధారీరామస్య ప్రియ దర్శిని’అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాం. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు.ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున, విజయదశమి రోజున ‘రామలీల‘ను ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తూ ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్లుగా.. ఆమె పాలనలో మనందరం క్షేమంగా.. సుఖంగా ఉన్నట్లు భావించుకుందాం. పూజించుకుందాం.‘‘అఖిలాండేశ్వరీ... చాముండేశ్వరీ.. పాలయమాం గౌరీ... పరిపాలయమాం గౌరీ...’’ అని ప్రార్థిస్తూ... మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం.మహిషం అంటే దున్నపోతు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వం కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాతసంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మోహాలను, అహంకారాన్ని నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము.మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను, నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారం, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్క తేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకాలు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహంకార, మమకార భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థం కనిపించదు. అలాగే అజ్ఞానం వలన జ్ఞానం బహిర్గతం కాదు. వివేక జ్ఞానం ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తం అంటే రాగం, మోహం. రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం ఆనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరం నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసింది. అప్పుడు జగన్మాత వాడిని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనం మనకు ప్రాప్తిస్తుంది.విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ, మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.(గతంలో డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత ఆచార్యులు సాక్షి కోసం రాసిన ప్రత్యేక వ్యాసమిది -
విజయవాడ : సందడిగా దసరా సాంస్కృతికోత్సవాలు (ఫొటోలు)