వందకొట్టు.. మేకను పట్టు | Dasara Festival 2024 Lucky Draw Special Offer, 1 Goat For Just Rs 100, See This Offer Details | Sakshi
Sakshi News home page

వందకొట్టు.. మేకను పట్టు

Published Sat, Oct 5 2024 1:55 PM | Last Updated on Sat, Oct 5 2024 4:00 PM

Dasara Lucky Draw Special Offer

లింగాలఘణపురం: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు యువకులు ‘దసరా బొనాంజా’ పేరుతో ప్రకటించిన ఆఫర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రూ.100తో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ.. మద్యం, మాసం పేరుతో సోషల్‌ మీడియాలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. రూ.100కు ప్రథమ బహుమతిగా మేక, రెండో బహుమతిగా రెండు బ్లెండర్స్‌ ప్ర్‌పైడ్‌ ఫుల్‌ బాటిళ్లు, మూడో బహుమతిగా ఒక కార్టన్‌ బీర్లు, నాలుగో బహుమతిగా 2 నాటు కోళ్లు, అయిదో బహుమతిగా రాయల్‌స్టాగ్‌ ఫుల్‌ బాటిల్‌ అని పేర్కొన్నారు. 4వ తేదీ సాయంత్రం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టోకెన్లు అమ్ముతారని, 11వ తేదీన డ్రా తీస్తామంటూ.. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, పేర్లు సైతం పెట్టారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో ఇది వైరల్‌ అవుతోంది.

దసరా బొనాంజా అంటూ టోకెన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement