‘బీ న్యూ’ దసరా ప్రత్యేక ఆఫర్లు | Be New Mobiles leading mobile retail company announced several offers on the occasion of Dussehra festival | Sakshi
Sakshi News home page

‘బీ న్యూ’ దసరా ప్రత్యేక ఆఫర్లు

Published Sat, Oct 5 2024 3:49 AM | Last Updated on Sat, Oct 5 2024 5:58 AM

Be New Mobiles leading mobile retail company announced several offers on the occasion of Dussehra festival

హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా ‘బీ న్యూ మొబైల్స్‌’ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంఐ, వివో, ఒప్పో, రియల్‌మి, మొబైల్స్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు లక్కీడ్రా ద్వారా రూ.10 లక్షల నగదు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50% వరకు, యాక్సెసరీస్‌పై 80% వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. ల్యాప్‌టాప్‌పై రూ.10 వేలు, టీవీ కొనుగోలుపై రూ.5000 వరకు క్యాష్‌ బ్యాక్‌ అందిస్తుంది. 

టీవీఎస్‌ కార్డు ద్వారా కొనుగోలుపై ఒక ఈఎంఐ ఉచితంగా, ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 5% క్యాష్‌బ్యాక్‌ ఇస్తుంది. బజాజ్‌ఫిన్‌సర్వ్‌ ద్వారా వడ్డీ, డౌన్‌పేమెంట్‌ లేకుండా మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు సదుపాయం కల్పిస్తోంది. ప్రత్యేక ఆఫర్లను ప్రజలంతా వినియోగించుకోవాలని కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఈడీ సాయి నితీష్‌లు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement