దసరా పండుగ దేశమంతా ఒక తీరున... బెంగాల్‌లో ఒక తీరున జరుగుతుంది. కోల్‌కతాలోని కుమార్‌తులి అనే వాడ అంతా దుర్గ విగ్రహాల తయారీ,కొనుగోళ్లతో కోలాహలంగా మారుతుంది. పురుషులతోపా టు స్త్రీలు కూడా విగ్రహాలు తయారు చేస్తారు.
బెంగాలీల నవ రూప దుర్గలుగా కనిపించడానికి అక్కడ సెలబ్రిటీలు ఉవ్విళ్లూరుతారు. ఒక టీవీ చానెల్ స్పెషల్ షో కోసం ముస్తాబైన నవరూప దుర్గలు వీరు... ఆ అవతారాల పేర్లు, ఇతర బెంగాల్ దసరా విశేషాలు...
2024లో బెంగాల్‌లో దుర్గ పూజ వల్ల జరిగే సృజనాత్మకత ఆర్థిక లావాదేవీల అంచనా ఎంతో తెలుసా? 50 వేల కోట్లు. సృజనాత్మక ఆర్థిక లావాదేవీలు అంటే? దుర్గ విగ్రహాల తయారీ, మంట΄ాల ఏర్పాటు, అలంకరణ, వినోద కార్యక్రమాలు, పూజా సామగ్రి, భోజనాలు, పబ్లిసిటీ సామగ్రి, స్పాన్సర్‌షిప్‌లు, యాడ్‌లు, పుస్తకాల ప్రచురణ... ఇవన్నీ 50 వేల కోట్ల మేరకు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి కుటుంబం ఈ వేడుకల్లోపా ల్గొంటుంది.
కోల్‌కతా అంతా 3000కు పైగా దుర్గ మంట΄ాలు వెలుస్తాయి. హైదరాబాద్‌లో గణపతి మంట΄ాల్లాగే కోల్‌కతాలో అతి పెద్ద విగ్రహాలు పెట్టడానికి కూడా జనం ఉత్సాహపడతారు. నవరాత్రుల్లో నగరం నలుమూలలా పూజలు జరుగుతుంటే ప్రత్యేకంగా కోటి రూ΄ాయల ఖర్చుతో జరిగే పూజలు కనీసం 200 ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే దసరా అంటే బెంగాల్ బెంగాల్ అంటే దసరా.
17వ శతాబ్దం నుంచి
దుర్గ పూజ ఒకప్పుడు బెంగాల్‌లో జమీందారుల పండగగా ఉండేది. అయితే 1610లో సబర్ణ రాయ్ చౌదరి అనే జమీందారు కుటుంబం ప్రజల మధ్యలో తెచ్చి దుర్గ పూజ వేడుకలు మొదలెట్టింది. ఆ తర్వాత జమీందార్లు, శ్రీమంతులు కోల్‌కతాలో దుర్గపూజ ఆర్భాటంగా చేయసాగారు.
1910లో కోల్‌కతాలో కొద్దిమంది సామాన్యులు చందాలు వేసుకొని మొదటి దుర్గా మంట΄ాన్ని నవరాత్రుల్లో మొదలెట్టారు. దాంతో జనం పోగయ్యి వాడవాడల దుర్గ మంట΄ాలు స్థాపించుకునే ఆనవాయితీ వచ్చింది.
అయితే 1985లో ఆసియన్ పెయింట్స్ వారు కోల్‌కతాలోని దుర్గ మంట΄ాల్లో ఉత్తమమైన వాటికి బహుమతులు ఇవ్వడంప్రారంభించే సరికి ఇక పోటాపోటీ మొదలయ్యి సృజనాత్మకంగా ఒకరికి మించి ఒకరు దుర్గ మంట΄ాలను విస్తృతం చేయసాగారు. ఆ తర్వాత కోల్‌కతాలోని ఎన్నో సంస్థలు నేడు దుర్గ మంట΄ాలకు అవార్డులు ఇస్తున్నాయి.
స్త్రీల పండుగ
దుర్గ అంటే శక్తి. దసరా అంటే మహిళా శక్తికి ప్రతీక. అందుకే బెంగాల్‌లో స్త్రీలు దసరాను చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజుల్లో ఎర్రంచు ఉన్న తెల్లచీర, ఎర్రగాజులు, కుంకుమ బొట్టుతో కళకళలాడతారు.
నవరాత్రుల్లో చివరి రోజు వీరంతా ‘పుట్టింటికి వచ్చిన దుర్గమ్మ తిరిగి అత్తవారింటికి వెళ్లిపోతున్న’ సందర్భంగా ‘సిందూర్ ఖేలా’ అనే ఆటను ఆడతారు. వివాహితలు ఒకరికి ఒకరు కుంకుమ బొట్టు పెట్టుకుని ఆనందిస్తారు. ఇలా చేస్తే తమ సౌభాగ్యం చెక్కు చెదరదని భావిస్తారు.
కుమార్ తులిలో విగ్రహాలు
కోల్‌కతాలో కుమార్ తులి అనేప్రాంతంలో సంవత్సరం అంతా దుర్గ విగ్రహాలు తయారు చేస్తూనే ఉంటారు. ప్రతి బొమ్మను విలక్షణంగా తీర్చిదిద్దడమే కాదు ఆ విగ్రహానికి అమర్చే దుస్తులు, నగలు కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఒక్కో విగ్రహం పది వేల నుంచి రెండు–మూడు లక్షల వరకూ ఉంటుంది. కుమార్ తులిలో చినపా ల్, నమితాపా ల్, మాలాపా ల్, కోకిలాపా ల్ అనే నలుగురు అక్కచెల్లెళ్లు దుర్గ విగ్రహాల తయారీలో పేరు గడించారు.
నవ దుర్గలు
విగ్రహాలతోపా టు సెలబ్రిటీలు కూడా ఈ సందర్భంగా దుర్గ అవతారాలను ధరించి వివిధ షోలలోపా ల్గొంటూ ప్రేక్షకులకు ఉత్సాహం కలిగిస్తారు. జీ బెంగాలీ చానల్ ఈ సంవత్సరం తమ సీరియల్స్‌లో నటించే నటీమణుల చేత నవ దుర్గలపా త్రలు ధరింప చేసి అందరినీ ఆకట్టుకుంది. బెంగాల్ వారు నవరాత్రుల సందర్భం గా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ నవ దుర్గలను ఆవిష్కరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment